Advertisementt

ఎన్నెన్నో జన్మల బంధం... స్టార్ మా లో..

Mon 18th Oct 2021 09:54 AM
star maa,ennenno janmala bandham,indian clicks,llc  ఎన్నెన్నో జన్మల బంధం... స్టార్ మా లో..
Watch Star Maa Exciting New Daily Soap- Ennenno Janmala Bandham ఎన్నెన్నో జన్మల బంధం... స్టార్ మా లో..
Advertisement
Ads by CJ

కొత్తదనం వున్న కథలు... ప్రతి ఇల్లూ తనది అనుకునే ఎన్నో కుటుంబాల్ని తెలుగు ప్రేక్షకులకు తన ధారావాహికలతో పరిచయం చేస్తున్న స్టార్ మా ఈ సారి మరో వినూత్నమైన కథ తో ఓ కొత్త సీరియల్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. దాని పేరు ఎన్నెన్నో జన్మల బంధం.

అమ్మ ప్రేమ కోరుకునే ఓ పాపకి, అమ్మ అనే పిలుపు కోసం ఆరాటపడే ఓ అమ్మాయి, ఆ పాప తండ్రి మధ్య జరిగే ఓ విలక్షణమైన కథ ఇది. జీవితం లో ఎవరు ఎవరికి దూరమవుతారో, ఎవరు ఎవరికి దగ్గరవుతారో ఊహించలేని పరిస్థితుల్లో ఈ ముగ్గురి జీవితాలు ఎన్ని మలుపులు తిరిగాయనేదే ఈ సీరియల్ కథ లో ముఖ్యమైన ప్రయాణం.

కట్టిపడేసే భావోద్వేగాలు, కథాపరంగా అద్భుతం అనిపించే సన్నివేశాలు, పదునైన సంభాషణలు ఈ ధారావాహికని వినూత్నంగా అందిస్తున్నాయి. "ఎన్నెన్నో జన్మల బంధం" అనే పాత తెలుగు వారికి బాగా తెలిసిందే అయినా ఈ సీరియల్ కోసం కొత్తగా తయారై ప్రతి హృదయాన్ని తట్టి లేపింది. సీరియల్ కూడా పాటలాగే అందంగా, అందుకో చెప్పిన విషయంలాగా విలక్షణంగా వుండబోతోంది.

అక్టోబర్ 18న రాత్రి 9. 30 గంటలకి లాంచ్ అవుతున్న ఈ ధారావాహిక స్టార్ మా ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతి కలిగించబోతోంది.

ఎన్నెన్నో జన్మల బంధం ప్రోమో కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి: https://youtu.be/uko5vRrQL1g

ఎన్నెన్నో జన్మల బంధం పాట ప్రోమో కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి: https://youtu.be/7RzTrjyZ8q0

Content Produced by: Indian Clicks, LLC

Watch Star Maa Exciting New Daily Soap- Ennenno Janmala Bandham:

Star Maa Exciting New Daily Soap- Ennenno Janmala Bandham

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ