Advertisementt

దుబాయ్‌లో ఖిలాడి

Fri 22nd Oct 2021 06:18 PM
mass maharaja ravi teja,ramesh varma,satyanarayana koneru,khiladi movie,khiladi song shoot in dubai  దుబాయ్‌లో ఖిలాడి
Ravi Teja Khiladi Song Shoot In Dubai దుబాయ్‌లో ఖిలాడి
Advertisement
Ads by CJ

మాస్ మహారాజ రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో రాబోతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ ఖిలాడి షూటింగ్ ముగింపు దశలో ఉంది. ఈ చిత్రాన్ని సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. ఈ మూవీలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ప్రస్తుతం చిత్రయూనిట్ దుబాయ్‌లో ఉంది. రవితేజ, మీనాక్షి చౌదరి, డింపుల్ హయతిలపై అంద‌మైన‌ పాటను చిత్రీకరించనున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ స్వ‌ర‌ప‌రిచిన ట్యూన్‌కు యశ్వంత్ మాస్టర్ కొరియోగ్రఫీ చేయబోతోన్నారు. ఈరోజు పాట చిత్రీక‌ర‌ణ‌  ప్రారంభమైంది. దుబాయ్‌తో పాటు మస్కట్‌లోని కొన్ని ప్రదేశాల్లో ఈ పాటను చిత్రీకరించనున్నారు.

రవితేజ, డింపుల్ హయతి న‌టించిన‌ ఇష్టం అనే పాటను వినాయక చవితి సందర్భంగా విడుదల చేశారు. దేవీ శ్రీ ప్రసాద్ ఇచ్చిన ఆ మెలోడీ ట్యూన్ అందరినీ ఆకట్టుకుంది. యశ్ మాస్టర్ ఆ పాటకు అందంగా కొరియోగ్రఫీ చేశారు.

థియేటర్లో ప్రేక్షకులను థ్రిల్‌కు గురి చేసేందుకు దర్శకుడు రమేష్ వర్మ అద్భుత‌మైన క‌థ‌ను రెడీ చేశారు. సుజిత్ వాసుదేవ్, జీకే విష్ణులు కెమెరామెన్‌లుగా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయంతో అల‌రించ‌నున్నారు.

ప్లే స్మార్ట్ అంటూ ట్యాగ్ లైన్‌తో రాబోతోన్న ఈ చిత్రం హవీష్ ప్రొడక్షన్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది.

Ravi Teja Khiladi Song Shoot In Dubai:

Mass Maharaja Ravi Teja, Ramesh Varma, Satyanarayana Koneru Khiladi Song Shoot In Dubai

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ