Advertisementt

దీపావళికి జీ 5 లో శ్రీదేవి సోడా సెంటర్

Fri 22nd Oct 2021 06:41 PM
sudheer babu,sridevi soda center movie,zee5 telugu,diwali gift  దీపావళికి జీ 5 లో శ్రీదేవి సోడా సెంటర్
Sudheer Babu Sridevi Soda Center to streaming on ZEE5 దీపావళికి జీ 5 లో శ్రీదేవి సోడా సెంటర్
Advertisement
Ads by CJ

వెబ్ సిరీస్‌లు, డైరెక్ట్‌-టు-డిజిట‌ల్ రిలీజ్‌లు, ఒరిజిన‌ల్ మూవీస్‌, డిజిట‌ల్ రిలీజ్‌లు... ఏవి కావాల‌న్నా వీక్ష‌కులు ముందుగా చూసే ఓటీటీ వేదిక జీ 5. ఒక్క హిందీలో మాత్రమే కాదు...తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ వంటి పలు భారతీయ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వీక్షకులకు వినోదాన్ని అందిస్తోంది. లాక్‌డౌన్ ఉన్నా, లేకున్నా మన మొబైల్, ట్యాబ్‌, డెస్క్‌టాప్‌, ల్యాప్‌టాప్‌లో జీ 5 ఉంటే చాలు... వినోదానికి లోటు ఉండదు. గత ఏడాది అమృత రామమ్ నుండి మొదలుపెడితే 47 డేస, మేకా సూరి, బట్టల రామస్వామి బయోపిక్కు, ఇటీవల నెట్, అలాంటి సిత్రాలు వరకూ ఎన్నో సినిమాలను జీ 5 డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్ చేసింది.

థియేటర్లలో విడుదలైన హిట్ సినిమాలను సైతం వీక్షకులకు అందిస్తోంది. దసరా పండక్కి శ్రీ విష్ణు రాజ రాజ చోరను విడుదల చేసి ప్రజలకు వినోదం అందించింది. ఇప్పుడు దీపావళి కానుకగా సుధీర్ బాబు రీసెంట్ హిట్ శ్రీదేవి సోడా సెంటర్ ను విడుదల చేయడానికి రెడీ అయ్యింది జీ 5.

సుధీర్ బాబు, ఆనంది జంటగా నటించిన సినిమా శ్రీదేవి సోడా సెంటర్. కరుణ కుమార్ దర్శకత్వంలో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన విమర్శకులను మెప్పించడంతో పాటు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

పరువు కోసం ఓ కన్నతండ్రి ఎంత దారుణానికి ఒడిగట్టారు? తన కులం కాని అమ్మాయిని ప్రేమించిన హీరో ఎన్ని కష్టాలు పడ్డాడు? అనేది సినిమాలో చాలా హృద్యంగా చూపించారు. పరువు హత్యల నేపథ్యంలో తెలుగులో వచ్చిన గొప్ప సినిమా శ్రీదేవి సోడా సెంటర్ అని విమర్శకులు, ప్రేక్షకులు ప్రశంసించారు. ఇప్పుడీ సినిమాను వీక్షకుల ముందుకు తీసుకొస్తోంది జీ 5.

భారతదేశంలో నంబర్ 1 ఓటీటీ జీ 5లో తమ సినిమా శ్రీదేవి సోడా సెంటర్ విడుదల అవుతుండటం సంతోషంగా ఉందని చిత్రబృందం తెలిపింది.

Sudheer Babu Sridevi Soda Center to streaming on ZEE5:

Sudheer Babu Sridevi Soda Center to streaming on ZEE5 Telugu as a Diwali gift

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ