Advertisementt

విశాల్, ఆర్య ఎనిమి ట్రైలర్ విడుదల

Sat 23rd Oct 2021 06:53 PM
enemy movie,enemy,vishal arya enemy,enemy trailer,vishal,arya,enimi  విశాల్, ఆర్య ఎనిమి ట్రైలర్ విడుదల
Vishal, Arya Enemy trailer released విశాల్, ఆర్య ఎనిమి ట్రైలర్ విడుదల
Advertisement
Ads by CJ

యాక్షన్ హీరో విశాల్, మ్యాన్లీ స్టార్ ఆర్య ఎనిమి ట్రైలర్ విడుదల

యాక్షన్ హీరో విశాల్, మ్యాన్లీ స్టార్ ఆర్య కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. వాడు వీడు తరువాత మరోసారి ఎనిమీ అంటూ ఈ ఇద్దరూ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌కు ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా.. మిని స్టుడియోస్ బ్యానర్ మీద ఎస్ వినోద్ కుమార్ నిర్మిస్తున్నారు. ఇక ఈ ఎనిమి సినిమా విశాల్‌కు 30, ఆర్యకు 32వ సినిమా కావడం విశేషం.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. 100 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్‌లో సినిమా ఎలా ఉండోబోతోందో చూపించారు. బరిలోకి దిగితే మీ ఇద్దరు శత్రువులు.. ఆ తరువాత మిత్రులు అంటూ ప్రకాష్ రాజ్ చెప్పిన డైలాగ్‌తో ఈ సినిమా కథ ఏంటో అర్థమైంది. అయితే ఆర్య విశాల్‌కు ఎందుకు శత్రువుగా మారాల్సి వచ్చింది? అనే ఆసక్తిని కలిగించేలా ట్రైలర్‌ను కట్ చేశారు. ఈ ట్రైలర్‌లో విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌ అద్భుతంగా ఉన్నాయి.

ఈ చిత్రంలో గద్దలకొండ గణేష్ ఫేమ్ మిర్నాలిని రవి హీరోయిన్‌గా నటిస్తున్నారు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, మమత మోహన్ దాస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆర్‌డీ రాజశేఖర్ ఈ చిత్రానికి కెమెరామెన్‌గా, తమన్ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు. దీపావళి కానుకగా ఈ చిత్రం ఒకేసారి తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది.

Vishal, Arya Enemy trailer released:

Enemy will be released in Tamil and Telugu

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ