Advertisementt

ట్యాక్సీ టైటిల్ లోగో విడుదల

Mon 25th Oct 2021 10:23 AM
taxi,taxi movie,taxi title logo,vasanth sameer pinnama raju,almas motiwala,surya srinivas,soumyaa menon,praveen yandamuri,saddam hussain,naveen pandita,taxi telugu movie  ట్యాక్సీ టైటిల్ లోగో విడుదల
Taxi Title Logo With Interesting Concept Unveiled ట్యాక్సీ టైటిల్ లోగో విడుదల
Advertisement
Ads by CJ

ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో ట్యాక్సీ టైటిల్ లోగో విడుదల

వసంత్ సమీర్ పిన్నమ రాజు, అల్మాస్ మోటివాలా, సూర్య శ్రీనివాస్, సౌమ్య మీనన్, ప్రవీణ్ యండమూరి, సద్దాం హుస్సేన్, నవీన్ పండిత.. మొదలగు వారు ప్రధాన పాత్రల్లో హెచ్ అండ్ హెచ్ ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్ పై హరిత సజ్జ (ఎం.డి) నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ ట్యాక్సీ. స్టార్ డైరెక్టర్ మరియు మాటల మాంత్రికుడు అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ వద్ద పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేసిన హరీష్ సజ్జా ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇక బిక్కి విజయ్ కుమార్(M.Tech) సహ నిర్మాతగా వ్యవరిస్తున్న ఈ చిత్రానికి మార్క్ రాబిన్ సంగీతం అందిస్తుండగా ఉరుకుండారెడ్డి ఎస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఆనంద్ పల్లకి వి.ఎఫ్ ఎక్స్ అందిస్తుండగా, టి.సి.ప్రసన్న ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.

వైవిధ్యమైన కథాంశంతో సస్పెన్స్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీ రూపొందుతోంది. ఇందులోని హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు మరియు థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ ఎన్నో ఉంటాయని చిత్ర బృందం తెలిపింది. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం టైటిల్ లోగో పోస్టర్ ను ఈరోజు ఆవిష్కరించారు. ఈ పోస్టర్ విషయానికి వస్తే.. ఓ గన్ పై కార్ ఉండడం.. అలాగే బ్యాక్ గ్రౌండ్ లో వైజాగ్ మ్యాప్ కూడా కనిపిస్తుండడం వంటివి  ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించే విధంగా ఉందని చెప్పొచ్చు.ఈ పోస్టర్ కు మంచి స్పందన కూడా లభిస్తుంది.ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన లవ్ స్టొరీ చిత్రానికి ఫైట్స్ కంపోజ్ చేసిన బి జె శ్రీధర్ ఈ చిత్రానికి కూడా ఫైట్స్ కంపోజ్ చేస్తుండడం మరో విశేషం. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలతో ఈ చిత్రం రూపొందుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది చిత్ర బృందం.

Taxi Title Logo With Interesting Concept Unveiled:

The makers are planning to release Taxi movie soon in theatres

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ