Advertisementt

ఐకాన్ స్టార్ ప్రెజెంట్స్ ఆహా 2.0

Tue 02nd Nov 2021 11:02 AM
icon star,aha 2.0,allu arjun,allu aravind,dil raju,ram rao jupally  ఐకాన్ స్టార్ ప్రెజెంట్స్ ఆహా 2.0
Icon Star presents aha 2.0 ఐకాన్ స్టార్ ప్రెజెంట్స్ ఆహా 2.0
Advertisement
Ads by CJ

దీపావ‌ళి కాంతుల వెలుగుల‌ను మ‌రింత పెంచ‌నున్న ఆహా ఐకాన్ స్టార్ ప్రెజెంట్స్ ఆహా 2.0

తిరుగులేని, నాన్‌స్టాప్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తూ తెలుగు వారి హృద‌యాల్లో ప్ర‌త్యేక స్థానాన్ని ద‌క్కించుకున్న వ‌న్ అండ్ ఓన్లీ 100 పర్సెంట్‌ తెలుగు ఓటీటీ మాధ్య‌మం ఆహా. గ్లోబెల్ రేంజ్‌లో ప్ర‌తీసారి ఆహా వీక్ష‌కుల కోసం ఎగ్జ‌యిట్‌మెంట్‌ను పెంచుతూ అంద‌రి అంచ‌నాల‌ను మించేలా దూసుకెళ్తోంది. ఈ ఏడాది దీపావళికి ఆ ఎగ్జ‌యిట్‌మెంట్‌ను రెట్టింపు చేసేలా పండుగ ఆనందాల‌ను పీక్స్‌కు తీసుకెళ్లేలా ఆహా యాప్‌ను 2.0గా అప్‌గ్రేడ్ చేసి స‌రికొత్త ఫీచ‌ర్స్‌తో వీక్ష‌కుల‌కు అందిస్తూ సంబ‌రాల‌ను తీసుకొస్తుంది ఆహా. అలాగే ఇర‌వై నెల‌లుగా కంటిన్యూగా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను  ఈ సంబ‌రాన్ని గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేస్తూ న‌వంబ‌ర్ 2న హైద‌రాబాద్‌లో ఐకాన్ స్టార్ ప్రెజెంట్స్ ఆహా 2.0 అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో పాపుల‌ర్ ఇంట‌ర్నేష‌న‌ల్ షోను ప్ర‌క‌టించ‌బోతున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌వుతున్నారు. 

ఆహాతో 100 ప‌ర్సెంట్ నాన్ స్టాప్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తామ‌ని తెలుగు ప్రేక్ష‌కులకు ప్రామిస్ చేసిన విధంగానే మాట‌ను నిల‌బెట్టుకుంటూ వ‌స్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆహా ప్ర‌మోట‌ర్స్ అల్లు అర‌వింద్‌, దిల్‌రాజు, రామ్ రావ్ జూప‌ల్లి ఆహాలో ప్ర‌సారం కాబోయే సూప‌ర్ హిట్ చిత్రాలు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌, ల‌క్ష్య‌, మంచి రోజులొచ్చాయి. డీజే టిల్లు, రొమాంటిక్‌, అనుభ‌వించు రాజా, పుష్ప‌క విమానం, గ‌ని వంటి ఫిక్ష‌న‌ల్‌, నాన్ ఫిక్ష‌న‌ల్ చిత్రాల‌తో పాటు ఆహా ఒరిజిన‌ల్స్ అన్‌స్టాప‌బుల్‌, సేనాప‌తి, భామా క‌లాపం, త్రీరోజెస్ వంటి చిత్రాల‌కు సంబంధించి కూడా వివ‌రాల‌ను తెలియ‌జేస్తారు. 

ఇప్పుడు ఆహాను స‌బ్‌స్క్రైబ్ చేసుకుని ఎవ‌రైతే ఎంజాయ్ చేస్తున్నారో ఆ వీక్ష‌కుల‌కు ఆహా 2.0 ద్వారా ఆడియో ప‌రంగా, పిక్చ‌ర్ క్వాలిటీ పరంగా వ‌ర‌ల్డ్ క్లాస్ ఫీచ‌ర్స్‌తో పాటు ఎలాంటి కంటెంట్ ప్రేక్ష‌కుడికి కావాల‌నే దానిపై కూడా ఈ యాప్ ద్వారా అందిస్తారు. 

2021 ఏడాదికిగానూ క్రాక్‌, లెవ‌న్త్ అవ‌ర్‌, జాంబిరెడ్డి, చావు క‌బురు చ‌ల్ల‌గా, నాంది, ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్‌, నీడ‌, కాలా, ఆహా భోజ‌నంబు, వ‌న్‌, సూప‌ర్ డీల‌క్స్‌, చ‌తుర్ ముఖం, కుడి ఎడ‌మైతే, త‌ర‌గ‌తి గ‌ది దాటి, ది బేక‌ర్ అండ్ ది బ్యూటీ, మ‌హా గ‌ణేశ‌, ప‌రిణయం, ఒరేయ్ బామ్మ‌ర్ది, కోల్డ్ కేస్‌, ఇచ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు వంటి ప్రోగ్రామ్స్‌తో ఆహా ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తోంది.

Icon Star presents aha 2.0:

This Diwali join in the celebration with aha at Icon Star presents aha 2.0

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ