Advertisementt

జీ 5 ఓటీటీలో రిపబ్లిక్ రిలీజ్ డేట్

Wed 03rd Nov 2021 07:28 PM
sai dharam tej,superhit film,republic movie,stream on zee5  జీ 5 ఓటీటీలో రిపబ్లిక్ రిలీజ్ డేట్
Republic to stream on ZEE5 జీ 5 ఓటీటీలో రిపబ్లిక్ రిలీజ్ డేట్
Advertisement
Ads by CJ

వెబ్ సిరీస్‌లు, డైరెక్ట్‌-టు-డిజిట‌ల్ రిలీజ్‌లు, ఒరిజిన‌ల్ మూవీస్‌, డిజిట‌ల్ రిలీజ్‌లు... ఏవి కావాల‌న్నా వీక్ష‌కులు ముందుగా చూసే ఓటీటీ వేదిక జీ 5. ఒక్క హిందీలో మాత్రమే కాదు...తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ వంటి పలు భారతీయ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వీక్షకులకు వినోదాన్ని అందిస్తోంది. లాక్‌డౌన్ ఉన్నా, లేకున్నా మన మొబైల్, ట్యాబ్‌, డెస్క్‌టాప్‌, ల్యాప్‌టాప్‌లో జీ 5 ఉంటే చాలు... వినోదానికి లోటు ఉండదు. గత ఏడాది అమృత రామమ్ నుండి మొదలుపెడితే 47 డేస్, మేకా సూరి, బట్టల రామస్వామి బయోపిక్కు, ఇటీవల నెట్, అలాంటి సిత్రాలు వరకూ ఎన్నో సినిమాలను జీ 5 డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్ చేసింది. థియేటర్లలో విడుదల అయిన సినిమాలను సైతం వీక్షకుల ముందుకు తీసుకొస్తుంది.

సాయి తేజ్ కథానాయకుడిగా దేవకట్టా దర్శకత్వంలో నిర్మాతలు జె. భగవాన్, జె. పుల్లారావు భాగస్వామ్యంతో జీ స్టూడియోస్ సంస్థ నిర్మించిన సినిమా రిపబ్లిక్. ఐశ్వర్య రాజేష్ కథానాయికగా... జగపతిబాబు, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి అద్భుత స్పందన లభించింది.

ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ అధికారుల పాత్ర ఎంత ఉంటుంది? ప్రస్తుత సమాజంలో రాజకీయ నాయకుల ధోరణి ఏ విధంగా ఉంది? ప్రజలను ఏవిధంగా దోచుకుంటున్నారు? అనే కథాంశంతో రిపబ్లిక్ తెరకెక్కింది.

కలెక్టర్ పాత్రలో సాయి తేజ్ నటన... సగటు రాజకీయ నాయకురాలిగా రమ్యకృష్ణ ఠీవి... ప్రభుత్వ ఉద్యోగిగా, తండ్రిగా జగపతిబాబు భావోద్వేగ భరిత అభినయం... దేవ కట్టా సంభాషణలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. పతాక సన్నివేశాలు సమాజంలో ప్రజల ఆలోచనా విధానాన్ని సైతం ఎండగట్టాయి. ప్రజల్ని చైతన్యవంతం చేసే విధంగా ఉన్న ఈ చిత్రాన్ని జీ 5 ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. 

సాయి తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ సినిమా కూడా జీ 5 ఓటీటీలో విడుదలైంది. ఆ సినిమా తర్వాత రూపొందిన రిపబ్లిక్ సైతం జీ 5 ఓటీటీలోకి‌ వస్తోంది. సాయి తేజ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు జీ 5లో విడుదల కానుండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. జీ 5తో‌ అనుబంధం ఇలాగే కొనసాగాలని సాయితేజ్ ఆకాంక్షించారు.

వీక్షకులకు వినోదం అందించడమే పరమావధిగా జీ 5 వరుసగా కొత్త సినిమాలను విడుదల చేస్తోంది. దసరా పండక్కి శ్రీ విష్ణు రాజ రాజ చోరను విడుదల చేసింది. దీపావళి కానుకగా ఈ నెల 4వ తేదీన శ్రీదేవి సోడా సెంటర్ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తోంది. ఆ తరువాత సుప్రీం హీరో సాయి తేజ్, దర్శకుడు దేవకట్టా కలయికలో రూపొందిన రిపబ్లిక్ చిత్రాన్ని విడుదల చేయనుంది.

Republic to stream on ZEE5:

Sai Dharam Tej Superhit film Republic to stream on ZEE5

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ