Advertisementt

ఛ‌లో ప్రేమిద్దాం ఫ‌స్ట్ సింగిల్

Fri 05th Nov 2021 08:34 PM
chalo premiddam,chalo premiddam movie,sai ronak,jagapathi babu,rk,uday kiran  ఛ‌లో ప్రేమిద్దాం ఫ‌స్ట్ సింగిల్
Chalo Premiddam movie 1st song launched ఛ‌లో ప్రేమిద్దాం ఫ‌స్ట్ సింగిల్
Advertisement
Ads by CJ

జ‌గ‌ప‌తి బాబు చేతుల మీదుగా ఛ‌లో ప్రేమిద్దాం ఫ‌స్ట్ సింగిల్ లాంచ్ 

హిమాల‌య స్టూడియో మేన్స‌న్స్ ప‌తాకంపై సాయి రోన‌క్‌, నేహ‌ సోలంకి హీరో హీరోయిన్లుగా సురేష్ శేఖ‌ర్ రేపల్లే ద‌ర్శ‌క‌త్వంలో ఉద‌య్ కిర‌ణ్‌ నిర్మిస్తోన్న చిత్రం ఛ‌లో ప్రేమిద్దాం. ఇటీవ‌ల విడుద‌లైన ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ అండ్ మోష‌న్ పోస్ట‌ర్ కి  అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని స‌మ‌కూర్చిన ఈ చిత్రంలోని ఫ‌స్ట్ సింగిల్ ఈ రోజు  విభిన్న న‌టుడు జ‌గ‌ప‌తి బాబు లాంచ్ చేసి చిత్ర యూనిట్‌కు శుభాకంక్ష‌లు తెలిపారు. ఎమ్‌బిఏ, ఎమ్‌సిఏలు చ‌ద‌వ‌లేక‌పోతివి అంటూ సాగే ఈ కాలేజ్ సాంగ్ కు దేవ్ ప‌వార్ అద్భ‌త‌మైన‌ సాహిత్యాన్ని స‌మ‌కూర్చ‌గా వెంక‌ట్ దీప్ కొరియోగ్ర‌ఫీ అందించారు. ఆదిత్య ద్వారా ఆడియో మార్కెట్ లోకి విడుద‌లైంది.

ఈ సంద‌ర్భంగా నిర్మాత ఉద‌య్ కిర‌ణ్  మాట్లాడుతూ.. ఈ రోజు జ‌గ‌ప‌తి బాబు గారి చేతుల మీదుగా మా చిత్రంలోని ఫ‌స్ట్ సాంగ్ లాంచ్ చేశాం. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు చాలా థ్యాంక్స్. ఇక ప్ర‌స్తుతం మా సినిమాకు సంబంధించిన సెన్సార్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లో సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం అన్నారు.

డైర‌క్ట‌ర్ సురేష్ శేఖ‌ర్ రేప‌ల్లే మాట్లాడుతూ.. ఇటీవ‌ల విడుద‌లైన మా చిత్రం ఫ‌స్ట్ లుక్, మోష‌న్ పోస్ట‌ర్ కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఇక ఈ రోజు మా చిత్రంలోని ఫ‌స్ట్ సింగిల్ ను జ‌గ‌ప‌తి బాబు గారు లాంచ్ చేయ‌డం చాలా హ్యాపీగా ఉంది. ఎమ్‌బిఏ, ఎమ్‌సిఏలు చ‌ద‌వ‌లేక‌పోతివి అనే ప‌ల్ల‌వితో ప్రారంభ‌మ‌య్యే ఈ కాలేజ్ సాంగ్ యూత్ తో పాటు ప్ర‌తి ఒక్క‌క‌రికీ క‌నెక్టయ్యే విధంగా భీమ్స్ కంపోజ్ చేయ‌గా దేవ్ ప‌వార్ ట్రెండీగా రాశారు. వెంక‌ట్ దీప్ మ్యూజిక్ కి త‌గ్గ‌ట్టుగా డిఫ‌రెంట్ స్టెప్స్ తో సాంగ్ ను కొరియోగ్ర‌ఫీ చేశారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్ లోకి విడుద‌లైన మా సాంగ్ అంద‌రికీ నచ్చుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంది. వ‌రుస‌గా ఒక్కో సింగిల్ రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేశాం. అతి త్వ‌ర‌లో సినిమా విడుద‌ల తేదీ ప్ర‌క‌టిస్తాం అన్నారు.

హీరో సాయి రోన‌క్ మాట్లాడుతూ.. జ‌గ‌ప‌తి బాబు గారు మా మూవీ ఫ‌స్ట్ సింగిల్ రిలీజ్ చేయ‌డం హ్యాపీ. సినిమాలో వ‌చ్చే ఫ‌స్ట్ సాంగ్ ఇది. చాలా ఎన‌ర్జిటిక్ గా ఉంటుంది. భీమ్స్ గారు వండ్ర‌ఫుల్ కంపోజ్ చేశారు. వెంక‌ట్ మాస్ట‌ర్ స్టెప్స్ కూడా కొత్త‌గా ట్రై చేశారు. అంద‌రికీ సాంగ్ న‌చ్చుతుంద‌ని ఆశిస్తున్నాం అన్నారు.

న‌టుడు ఆర్‌.కె. మాట్లాడుతూ.. ద‌ర్శ‌కుడు సురేష్ నాకు మంచి మిత్రుడు. ఈ సినిమాలో నేను ఒక మంచి రోల్ చేశాను. ఈ రోజు ఒక యూత్ ఫుల్ సాంగ్ రిలీజ్ అయింది. అంద‌రూ విని సాంగ్ ని మంచి సక్సె స్ చేయాల‌న్నారు. శ‌శాంక్, సిజ్జు,  అలీ, నాగినీడు, పోసాని కృష్ణ‌ముర‌ళి, ర‌ఘుబాబు, బాహుబ‌లి ప్ర‌భాక‌ర్‌, హేమ‌, ర‌ఘు కారుమంచి, సూర్య‌, తాగుబోతు ర‌మేష్‌, అనంత్ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి సంగీతంః భీమ్స్ సిసిరోలియో; పాట‌లుః సురేష్ గంగుల‌, దేవ్‌, ఎడిటింగ్ః ఉపేంద్ర జ‌క్క‌; ఆర్ట్ డైర‌క్ట‌ర్ః రామాంజ‌నేయులు; పీఆర్వోః ర‌మేష్ చందు, న‌గేష్ పెట్లు, ఫైట్స్ః న‌భా-సుబ్బు, కొరియోగ్ర‌ఫీః వెంక‌ట్ దీప్‌; సినిమాటోగ్ర‌ఫీః అజిత్ వి.రెడ్డి, జ‌య‌పాల్ రెడ్డి; నిర్మాతః ఉద‌య్ కిర‌ణ్‌, ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వంః సురేష్ శేఖ‌ర్ రేప‌ల్లె. 

Click Here Video: Chalo Premiddam movie 1st song launched

Chalo Premiddam movie 1st song launched:

Chalo Premiddam movie 1st song launched by Jagapathi babu

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ