Advertisementt

వివాదం: చిత్ర పరిశ్రమలో మరో ఎన్నికల యుద్దం

Sun 07th Nov 2021 04:49 PM
film directors election,film directors,a prabhu,maddineni ramesh,maa elections,film directors,elections  వివాదం: చిత్ర పరిశ్రమలో మరో ఎన్నికల యుద్దం
Film Directors Election War వివాదం: చిత్ర పరిశ్రమలో మరో ఎన్నికల యుద్దం
Advertisement
Ads by CJ

చిత్ర పరిశ్రమలో మరో ఎన్నికల యుద్దం

మా ఎన్నికల సందర్భంగా జరిగిన రచ్చను, రసాభాసను మర్చిపోకముందే ఇప్పుడు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మరో ఎన్నికల వివాదం రాజుకుంటుంది. నవంబర్ 14న జరగనున్న తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న కె వి ఆర్ చౌదరి అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ ఇద్దరు సభ్యుల నామినేషన్స్ ను తిరస్కరించడం చిత్ర పరిశ్రమలో వివాదానికి, తీవ్ర చర్చకు దారి తీసింది.

ముఖ్యంగా సీనియర్ జర్నలిస్టు, దర్శకుడు ప్రభు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నకారణంగా చలనచిత్ర దర్శకుల సంఘంలో పోటీ చేయడానికి వీలులేదు అంటూ ఆయన నామినేషన్ ను తిరస్కరించడం చర్చనీయాంశమైంది. చిత్ర పరిశ్రమలోని 24 క్రాఫ్ట్స్ లో ఏదైనా అసోసియేషన్ పదవిలో ఉన్నట్లయితే దర్శకుల సంఘంలో పోటీ చేయకూడదు అనే నిబంధన ఉంది అనే సాకుతో తన నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి కె వి ఆర్ చౌదరి తిరస్కరించటాన్ని దర్శక, పాత్రికేయుడు ప్రభు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అసలు అలాంటి నిబంధన ఏదీ అసోసియేషన్ బైలాలో లేకపోయినప్పటికీ ఎన్నికల అధికారి చౌదరి కొందరు వ్యక్తుల వత్తిడికి తలవోగ్గి ఉద్దేశ్యపూర్వకంగానే తన నామినేషన్ ను తిరస్కరించారన్నది ప్రభు ఆరోపణ.

అలాగే మరొక సీనియర్ దర్శకుడు మద్దినేని రమేష్ అభ్యర్థిత్వాన్ని కూడా తిరస్కరించడం వెనుక కొందరు సినీ పెద్దల హస్తం ఉందని,  మినిట్స్ బుక్  లోని రిసొల్యుషన్స్ ను తారుమారు చేసి అక్రమాలకు పాల్పడిన గత కమిటీకి రిటర్నింగ్ ఆఫీసర్ చౌదరి కొమ్ముకాస్తున్నారని మద్దినేని రమేష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతూ న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. అలాగే జర్నలిస్ట్ ప్రభు కూడా తన అభ్యర్థిత్వాన్ని తిరస్కరించిన కారణం అప్రజాస్వామికంగా ఉందంటూ కోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉన్నట్లుగా తెలిసింది. ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమ మరో పెద్ద ఎన్నికల వివాదానికి వేదిక కాబోయే సూచనలు కనిపిస్తున్నాయి.

Film Directors Election War:

Another election battle in the film industry

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ