Advertisementt

ప్రభుదేవా, రెజీనాలతో అనసూయ ఫ్లాష్ బ్యాక్

Tue 09th Nov 2021 01:32 PM
flashback,flashback movie,prabhu deva,regina,anasuya flashback,an balaji,sri lakshmi jyothi creations,nandu turlapati  ప్రభుదేవా, రెజీనాలతో అనసూయ ఫ్లాష్ బ్యాక్
Prabhu Deva, Regina, Anasuya Flashback ప్రభుదేవా, రెజీనాలతో అనసూయ ఫ్లాష్ బ్యాక్
Advertisement
Ads by CJ

ప్రభుదేవా, రెజీనాలతో అనసూయ ఫ్లాష్ బ్యాక్..  డబ్బింగ్ పనులు ప్రారంభం 

ప్రభుదేవా, రెజీనా, అనసూయ, ఆర్యన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న క్రేజీ మూవీ ఫ్లాష్ బ్యాక్. గుర్తుకొస్తున్నాయి అనే ట్యాగ్ లైన్‌తో రాబోతున్న ఈ సినిమాను అభిషేక్ ఫిలిమ్స్ బ్యానర్‌పై P. రమేష్ పిళ్ళై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. డాన్ శ్యాండీ దర్శకత్వం వహిస్తున్నారు. ద్విభాషా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ అధినేత, నిర్మాత ఎ.ఎన్ బాలాజీ తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు. అన్ని హంగులు జోడించి మునుపెన్నడూ చూడని ఓ అద్భుతమైన కథను తెరపై ఆవిష్కరించబోతున్నారు.   

బలమైన ఎమోషన్స్‌తో కూడిన కథను నేటితరం ఆడియన్స్ కోరుకునే ఆసక్తికర సన్నివేశాలు జోడిస్తూ సినిమాను అత్యద్భుతంగా మలిచి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. టైటిల్, ట్యాగ్ లైన్‌ క్రేజీగా పెట్టి సినిమాపై ఆసక్తి రేకెత్తించారు మేకర్స్. ఈ సినిమాలో చూపించే ప్రతి సన్నివేశం కూడా సగటు ప్రేక్షకుడి మదిలో ఎప్పటికీ నిలిచిపోతుందని, అన్ని వర్గాల ఆడియన్స్ కెనెక్ట్ అయ్యేలా ఈ మూవీ రూపొందించామని దర్శకనిర్మాతలు చెప్పారు. 

చిత్రంలో యంగ్ హీరోయిన్ రెజీనా ఓ ఆంగ్లో ఇండియన్ టీచర్‌గా విలక్షణ పాత్ర పోషిస్తుండగా.. అనసూయ ముఖ్య పాత్రలో నటిస్తోంది. ఈ ఇద్దరి రోల్స్ సినిమాలో మేజర్ అట్రాక్షన్ కానున్నాయి. అనసూయ రోల్ హైలైట్ కానుందని, ప్రభుదేవా క్యారెక్టర్ కొత్తగా ఉంటుందని దర్శకనిర్మాతలు చెప్పారు. ఇక ఈ చిత్రానికి శ్యామ్ CS అందించిన బాణీలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో అసెట్ అని అన్నారు. గత కొంతకాలంగా రిచ్ లొకేషన్స్‌లో షూటింగ్ జరిపిన చిత్రయూనిట్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ వేగంగా ఫినిష్ చేస్తోంది. ఇందులో భాగంగా మొదట అనసూయ డబ్బింగ్ స్టార్ట్ చేయగా, ఈ మూవీ గ్రాండ్ సక్సెస్ అవుతుందని చెప్పేలా డబ్బింగ్ థియేటర్‌లో జబర్దస్త్ పోజిచ్చి ఆకట్టుకుంది అనసూయ. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ ఫ్లాష్ బ్యాక్ మూవీకి నందు దుర్లపాటి మాటలు రాశారు. సరికొత్త పాయిట్‌తో తమ సినిమా అందరినీ ఆకట్టుకోవడమే గాక పక్కాగా సక్సెస్ సాధిస్తుందని ధీమాగా చెబుతున్నారు దర్శకనిర్మాతలు. అతిత్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.

Prabhu Deva, Regina, Anasuya Flashback:

Prabhu Deva, Regina, Anasuya Flashback post production Works Begin

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ