Advertisementt

మిస్సింగ్ ఎంగేజింగ్ థ్రిల్లర్ చేస్తుంది

Tue 16th Nov 2021 06:42 PM
missing movie,heroines,misha narang,nikkesha rangwala  మిస్సింగ్ ఎంగేజింగ్ థ్రిల్లర్ చేస్తుంది
MISSING Movie interview మిస్సింగ్ ఎంగేజింగ్ థ్రిల్లర్ చేస్తుంది
Advertisement
Ads by CJ

మిస్సింగ్ సినిమా థియేట్రికల్ రెస్పాన్స్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నామని చెబుతున్నారు నాయికలు మిషా నారంగ్, నికీషా రంగ్వాలా. హర్షా నర్రా హీరోగా నటించిన ఈ సినిమాలో నాయికలుగా విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారీ అందాల తారలు. బజరంగబలి క్రియేషన్స్ పతాకంపై భాస్కర్ జోస్యుల, లక్ష్మీశేషగిరి రావు నిర్మించిన మిస్సింగ్ చిత్రాన్ని దర్శకుడు శ్రీని జోస్యుల తెరకెక్కించారు. ఈనెల 19న మిస్సింగ్ మూవీ థియేటర్లలో విడుదలవుతున్న సందర్భంగా సినిమా హైలైట్స్ నాయికలు మిషా నారంగ్, నికీషా రంగ్వాలా తెలిపారు. 

హీరోయిన్ నికీషా రంగ్వాలా మాట్లాడుతూ...నాది కెనడా. ముంబైలో మోడలింగ్ కెరీర్  ప్రారంభించాను. తెలుగుతో పాటు హిందీ, ఒక హాలీవుడ్ మూవీ చేస్తున్నాను. మిస్సింగ్ రిలీజ్ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాం. ఈ సినిమాకు థియేటర్లలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అని ఆతృతగా వేచి ఉన్నాం. మా సినిమా లాక్ డౌన్ వల్ల రిలీజ్ చాలా సార్లు పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. అయినా మూవీ కంటెంట్ ఇవాళ్టి ఆడియెన్స్ కు కూడా రిలేట్ అయ్యేలా ఉంటుంది. “మిస్సింగ్” మూవీలో శృతి అనే క్యారెక్టర్ ప్లే చేశాను. ఈ సినిమాలో మిస్ అయ్యేది నేనే. మిస్సింగ్ సినిమా ఎంగేజింగ్ థ్రిల్లర్ గా మిమ్మల్ని మెప్పిస్తుందని ఆశిస్తున్నాను. ఎక్కడా వల్గారిటీ లేకుండా ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా వచ్చి చూసేలా మా దర్శకుడు శ్రీని జోస్యుల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా దర్శకుడు శ్రీని చాలా కేర్ తీసుకున్నారు. సినిమా స్టార్టింగ్ నుంచి ఇప్పుడు పోస్టర్ డిజైన్స్ వరకు ఇంట్రెస్టింగ్ గా సినిమాను ఆడియెన్స్ దగ్గరకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు మంచి యాక్షన్ సీన్స్ ఉంటాయి. హీరో హర్ష యాక్షన్ సీన్స్ బాగా చేశారు. నాయికలుగా మా ఇద్దరి కాంబినేషన్ సీన్స్ చాలా తక్కువ. మిస్సింగ్ మూవీని మిస్ కాకండి, చూసి ఎలా ఉందో చెప్పండి. అన్నారు.

హీరోయిన్ మిషా నారంగ్ మాట్లాడుతూ...మిస్సింగ్ సినిమా నా కెరీర్ లో చేసిన ఫస్ట్ ఫిల్మ్. ఈ సినిమా కంప్లీట్ చేశాకే తెల్లవారితే గురువారం సినిమాలో జాయిన్ అయ్యాను. ఆ సినిమా కంప్లీట్ చేసి రిలీజ్ అయినా, పాండమిక్ వల్ల మా చిత్రాన్ని థియేటర్ లోనే రిలీజ్ చేద్దామని ఆపాము. మిస్సింగ్ రిజల్ట్ కోసం నేను ఎగ్జైటింగ్ గా ఉన్నాను. ఈ చిత్రంలో మీనా అనే జర్నలిస్ట్ క్యారెక్టర్ లో కనిపిస్తాను. శృతి మిస్ అయిన కేస్ ను నేను ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు. సెర్చ్ వర్సెస్ రివేంజ్ అనే క్యాప్షన్ పెట్టాం. ఇందులో శృతి కోసం సెర్చ్ చేస్తుంటాం. ఎవరి మీద రివెంజ్ తీర్చుకున్నారు హీరో అనేది తెరపై చూడాలి. నికీషా తో కాంబినేషన్స్ సీన్స్ నాకు లేవు. దర్శకుడు శ్రీని చాలా క్లారిటీగా సినిమాను తెరకెక్కించారు. ఈ కథకు రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఏమున్నాయో దర్శకుడినే అడగాలి. నా లైఫ్ లో ఇలాంటి సందర్భం ఎదురుకాలేదు. మిస్సింగ్ మంచి థ్రిల్లర్ మూవీ. వచ్చి థియేటర్లలో చూడండి. మీ రెస్పాన్స్ కోసం వేచి చూస్తున్నాం. ప్రస్తుతం ఆది సాయికుమార్ తో ఒక సినిమాలో నటిస్తున్నాను. మరో తమిళ చిత్రం కంప్లీట్ అయ్యే దశలో ఉంది. అన్నారు. అన్నారు.

MISSING Movie interview:

MISSING Movie heroines Misha Narang,Nikkesha Rangwala interview

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ