Advertisementt

నవంబర్ 19న స్ట్రీట్ లైట్

Thu 18th Nov 2021 05:50 PM
streetlight,street light movie,street light,streetlight telugu movie,streetlight on november 19th  నవంబర్ 19న స్ట్రీట్ లైట్
Streetlight on November 19th నవంబర్ 19న స్ట్రీట్ లైట్
Advertisement
Ads by CJ

నవంబర్ 19 న 150 థియేటర్స్ లలో విడుదలవుతున్న స్ట్రీట్ లైట్ మూవీ

మూవీ మాక్స్ బ్యానర్ పై తాన్య దేశాయ్, అంకిత్ రాజ్, కావ్య రెడ్డి, సీనియర్ హీరో వినోద్ కుమార్ నటీనటులుగా విశ్వ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత & డిస్ట్రిబ్యూటర్ శ్రీ మామిడాల శ్రీనివాస్ నిర్మించిన చిత్రం స్ట్రీట్ లైట్. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్, టీజర్, పాటలకు ప్రేక్షకులనుడి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం తెలుగు లో నవంబర్ 19న 150 థియేటర్స్ లో ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. 

చిత్ర నిర్మాత మామిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. డిస్ట్రిబ్యూటర్స్ మాకు సపోర్ట్ చేయడంతో మాకు 150 థియేటర్స్ దొరికాయి. ఈ సినిమా కథ విషయానికి వస్తే ఒక రాత్రి స్ట్రీట్ లైట్ కింద విభిన్న వ్యక్తుల వింత పోకడలను సునిశితమైన రీతిలో వినోదాత్మకంగా చూపిస్తూ, పగలు మంచివాళ్ళుగా చెలామణి అవుతూ రాత్రి కాగానే సెక్సువల్ పర్వషన్స్ తో ఏ విధంగా తమ క్రైమ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ అమాయకుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారో, అందులో ఒక యువతికి జరిగిన అన్యాయానికి ఏవిధంగా ప్రతీకారం తీర్చుకుంది అనే రివెంజ్ డ్రామా కథాంశంతో స్ట్రీట్ లైట్ చిత్రం రూపొందించడం జరిగింది. మంచి మేకింగ్ వాల్యూస్ తో వైవిధ్యభరితమైన సినిమాను రూపొందించి నందుకు సెన్సార్ సభ్యులు అభినందించారు. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ స్ట్రీట్ లైట్ సినిమాని  నవంబర్ 19న 150  థియేటర్లలలో రిలీజ్ చేస్తున్నాము. 

నటీనటులు: తాన్య దేశాయ్, అంకిత్ రాజ్, సీనియర్ హీరో వినోద్ కుమార్, చిత్రం శ్రీను, ధన్ రాజ్, షకలక శంకర్, ఈశ్వర్, కావ్య రెడ్డి, వైభవ్, కొండా బాబు, సాయి కీర్తన , Dr. పరమహంస, పవిత్ర, బాలాజీ నాగలింగం తదితరులు నటించారు. 

Streetlight on November 19th:

Streetlight Movie on November 19th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ