Advertisementt

రామ్ అసుర్ సినిమాకి సూపర్ రెస్పాన్స్

Sun 21st Nov 2021 05:13 PM
ram asur movie,abhinav sardhar,venkatesh treparna,shani,sharry  రామ్ అసుర్ సినిమాకి సూపర్ రెస్పాన్స్
Ram Asur movie Thanks meet రామ్ అసుర్ సినిమాకి సూపర్ రెస్పాన్స్
Advertisement
Ads by CJ

యాక్షన్ థ్రిల్లర్ రామ్ అసుర్ సినిమాకి సూపర్ రెస్పాన్స్

ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన చిత్రం రామ్ అసుర్. అభిన‌వ్ స‌ర్ధార్‌, రామ్ కార్తిక్  కథానాయకులుగా నటించిన ఈ చిత్రానికి వెంక‌టేష్ త్రిప‌ర్ణ క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం అందించగా  విడుదలైన తొలి రోజు నుంచి ఈ సినిమా మంచి ఆదరణ దక్కించుకుంటుంది. విమర్శకుల ప్రశంశలు సైతం పొందుతుంది. ఈ సినిమా లో అభినవ్ సర్దార్ నటన హైలైట్ కాగా, వెంకటేష్ త్రిపర్ణ దర్శకత్వం సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి దోహదపడింది. కథ లో కొత్తదనం, దర్శకత్వంలో అత్యుత్తమ ప్రతిభ నెలకొని ఉండడం తో ఈ సినిమా ప్రేక్షకులను బాగా అలరిస్తుంది. మరి ఈ సినిమా ఇంత పెద్ద ఘన విజయం అయిన నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి చిత్ర బృందం హాజరుఅయ్యింది. 

సహా నిర్మాత ఆర్కే మాట్లాడుతూ.. ఈ సినిమాకు ఇంత పెద్ద విజయం వచ్చేలా చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మేము ఇప్పుడు మంచి సక్సెస్ జోష్ లో ఉన్నాము. చాలా తక్కువ సమయంలో షూటింగ్ జరిగింది. ఎంతో ధైర్యంగా కరోనా సమయంలో షూటింగ్ చేసి ఇప్పుడు ఈ సక్సెస్ సాధించాము. మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు. 

నటుడు షానీ సల్మాన్ మాట్లాడుతూ.. ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ సాధించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. మాకు ఇంత పెద్ద విజయం దక్కేలా చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. మీడియా సపోర్ట్ వల్లే మాకు ఇంత పెద్ద విజయం దక్కింది.రామ్ అసుర్ సినిమా కే మంచి పేరొచ్చింది. వర్షాల వల్ల చాలా చోట్ల సినిమాను చూడలేకపోయారు. ఇప్పటివరకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. డైరెక్టర్ వెంకటేష్ మంచి సినిమా చేశారు. హీరోలు ఇద్దరు కూడా అద్భుతంగా నటించారు.నా పాత్ర కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాకు పనిచేసిన అందరికీ అభినందనలు అన్నారు. 

హీరోయిన్ శెర్రి అగర్వాల్ మాట్లాడుతూ.. ఈ సినిమా  ఇంత బాగా రావడానికి కారణం డైరెక్టర్ వెంకటేష్ గారు. మంచి కథ తో ఈ సినిమా ను తెరకెక్కించారు. లవ్, యాక్షన్ కలగలిపి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హీరోలు ఇద్దరు కూడా చాలా బాగా నటించారు. నాకు ఇంత మంచి సినిమా లో నటించే అవకాశం ఇచ్చిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు. 

దర్శకుడు వెంకటేష్ త్రిపర్ణ మాట్లాడుతూ.. ఈ సినిమా రిజల్ట్ చూసిన తర్వాత మేము ఇన్ని రోజులు పడ్డ కష్టం అంతా మర్చిపోయాము. అందరు ఈ సినిమా ను ఎంతో మెచ్చుకుంటున్నారు. క్రిటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో గానీ, కలెక్షన్స్ పాయింట్ అఫ్ వ్యూ లో గానీ మా సినిమా కి మంచి ఆదరణ లభిస్తుంది. భారీ వర్షాల్లో కూడా ప్రేక్షకులు మా సినిమా ను వీక్షిస్తున్నారు అంటే సినిమా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మాకు సపోర్ట్ చేసిన మీడియా వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. అభినవ్ సర్దార్, రామ్ కార్తిక్ ల నటన అదిరిపోయింది. గ్లామర్ విషయంలో ఇద్దరు హీరోయిన్లు కూడా సినిమాకు చాలా ఉపయోగపడ్డారు. శానీ పాత్ర కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమా సక్సెస్ కు కారణమైన అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. 

హీరో అభినవ్ సర్దార్ మాట్లాడుతూ.. మా సక్సెస్ టూర్ లో భాగంగా కొన్ని నగరాలకు వెళ్లి ఆడియన్స్ తో సినిమా చూసి వారితో కలిసి ఎంతో ఎంజాయ్ చేశాము. ఆ రెస్పాన్స్ మేము ఎప్పటికీ మర్చిపోలేనిది. వర్షంలో కూడా చాలా మంది మా సినిమా ను వీక్షించి సూపర్ హిట్ చేశారు.మాకు సపోర్ట్ చేసిన మీడియా అందరికీ కృతజ్ఞతలు. క్రిటిక్స్ కూడా సినిమాలో ఏది బాగుంటుంది అనే అంశాన్ని సరిగ్గా ప్రజెంట్ చేయగలిగారు. వెంకటేష్ త్రిపర్ణ అందించిన కథ చాలా బాగుంది. దానికి తగ్గట్లే డైరెక్షన్ కూడా అదిరిపోయింది. ప్రభాకర్ రెడ్డి గారు మంచి సినిమాటోగ్రఫీ అందించారు. భీమ్స్ అందించిన సంగీతం వల్లే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమాలోని నటీనటులందరూ చాలా బాగా చేశారు. ముఖ్యంగా శానీ పాత్ర ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆయన కూడా ఎప్పటిలాగే చాలా బాగా నటించారు. మా సినిమా ఇంత పెద్ద విజయం సాధించడానికి కారణమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు.

Ram Asur movie Thanks meet:

Super response to action thriller Ram Asur movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ