Advertisementt

నాగ చైతన్య చేతుల మీదుగా లక్ష్య సయ సయ సాంగ్

Sat 04th Dec 2021 06:23 PM
naga chaitanya,saya saya song,naga shaurya,lakshya movie,kethika sharma  నాగ చైతన్య చేతుల మీదుగా లక్ష్య సయ సయ సాంగ్
Naga Chaitanya Released Saya Saya Song From Lakshya నాగ చైతన్య చేతుల మీదుగా లక్ష్య సయ సయ సాంగ్
Advertisement
Ads by CJ

యంగ్ అండ్ వర్సటైల్ యాక్టర్ నాగ శౌర్య హీరోగా  స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రాబోతోన్న చిత్రం లక్ష్య. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 10న విడుదల కానుంది. ఈ మూవీ ట్రైలర్‌ను విక్టరీ వెంకటేష్ విడుదల చేయగా.. సినిమా మీద అంచనాలు రెట్టింపు అయ్యాయి.

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య సయ సయ అనే పాటకు సంబంధించిన లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఈ పాటలో నాగశౌర్య, కేతిక శర్మ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది.

కృష్ణ కాంత్ మంచి సాహిత్యాన్ని అందించగా.. కాళ భైరవ క్యాచీ మెలోడి ట్యూన్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఇక జునైద్ కుమార్ గాత్రం శ్రావ్యంగా ఉంది. ఈ పాటలో నాగ శౌర్య, కేతిక శర్మలు ఎంతో అందంగా కనిపిస్తున్నారు.

జగపతి బాబు, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రల్లో కనిపించబోతోన్నారు. సోనాలి నారంగ్ సమర్ఫణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి. బ్యానర్లపై నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

డిసెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా లక్ష్య విడుదల కాబోతోంది.

Naga Chaitanya Released Saya Saya Song From Lakshya:

Naga Chaitanya Released Saya Saya Song From Naga Shaurya Lakshya

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ