విశాల్, అధిక్ రవిచంద్రన్, మిని స్టుడియోస్, ఎస్ వినోద్ కుమార్ కాంబినేషన్ లో బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్
యాక్షన్ హీరో విశాల్, మ్యాన్లీ స్టార్ ఆర్య కాంబినేషన్లో వచ్చిన ఎనిమి సూపర్ హిట్ టాక్ తో మంచి కలెక్షన్లు సాధించింది. ఎనిమీ సినిమాను మిని స్టుడియోస్ బ్యానర్ మీద ఎస్ వినోద్ కుమార్ నిర్మించారు. అయితే తాజాగా మరోసారి ఈ కాంబినేషన్ సెట్ అయింది. విశాల్ హీరోగా ఎస్ వినోద్ కుమార్ మరో సినిమాను నిర్మించబోతన్నారు. ప్యాన్ ఇండియన్ స్థాయిలో రాబోతోన్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అప్డేట్‌ను మేకర్లు ఈ రోజు ప్రకటించారు.
విశాల్ కెరీర్‌లో 33వ సినిమాగా రాబోతోన్న ఈ ప్రాజెక్ట్‌కు అధిక్ రవిచంద్రన్ దర్శకుడిగా వ్యవహరించబోతోన్నారు. భారీ ఎత్తున నిర్మించబోతోన్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే చిత్రయూనిట్ వెల్లడించనుంది.