సందీప్ కిషన్ హీరోగా, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో రాబోతోన్న మైఖెల్ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, కరణ్ సీ ప్రొడక్షన్స్ ఎల్ఎల్‌పి సంయుక్తంగా నిర్మిస్తోంది. ఈ యాక్షన్ ఎంటర్టైన్ చిత్రాన్ని రంజిత్ జయకోడి తెలుగు, తమిళ, కన్నడ, మళయాల, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు.
ఈ మధ్యే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ మొదలైంది. ఈ సినిమాలోని ప్రతీ పాత్రకు ఓ ప్రాముఖ్యత ఉంది. స్టార్ డైరెక్టర్‌గా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించి, ఎన్నో చిత్రాలు, వెబ్ సిరీస్‌లో నటించిన గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నారు.
తాజాగా మేకర్లు ఈ సినిమాలో హీరోయిన్ పాత్రను రివీల్ చేశారు. మజిలి సినిమాతో ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ అందుకున్న దివ్యాంక కౌశిక్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్ర కోసం దివ్యాంక కౌశిక్‌ను దర్శకనిర్మాతలు తీసుకున్నారు.
సందీప్ కిషన్ పాత్ర ఎంతో ఇంటెన్సిటీతో ఉండబోతోంది. రజింత్ జయకోడి ఈ చిత్రానికి విభిన్నమైన స్క్రిప్ట్‌ను రెడీ చేశారు. నటీనటులకు ఈ చిత్రం స్పెషల్‌గా నిలిచిపోనుంది.
నారాయణ్ దాస్ కే నారంగ్ సమర్పణలో భరత్ చౌదరి, పుస్కుర్ రామ్ మోహన్ రావు కలిసి ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, మళయాలం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
చిత్ర నటీనటులకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.