Advertisementt

ఆది సాయి కుమార్ బర్త్ డే వేడుక

Fri 24th Dec 2021 06:32 PM
adi sai kumar,tees mar khan,di sai kumar birthday,payal rajput,sunil,anoop singh thakur,kabir singh,poorna,nagam thirupathi reddy  ఆది సాయి కుమార్ బర్త్ డే వేడుక
Adi Sai Kumar Birthday Celebration ఆది సాయి కుమార్ బర్త్ డే వేడుక
Advertisement
Ads by CJ

విజ‌న్ సినిమాస్ ఆఫీసులో ఆది సాయి కుమార్ బర్త్ డే వేడుక.. బెస్ట్ విషెస్ చెప్పిన తీస్ మార్ ఖాన్ టీమ్ 

ప్రేమ కావాలి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆది సాయి కుమార్ అంచెలంచెలుగా ఎదుగుతూ భారీ పాపులారిటీ దక్కించుకుంటున్నారు. ఈ సినిమాకు గాను బెస్ట్ డెబ్యూ మేల్ యాక్టర్‌గా అవార్డు అందుకున్న ఆయన ఆ తర్వాత ఎక్కడ వెనుతిరిగి చూడలేదు. వరుస ఆఫర్స్ పట్టేస్తూ విలక్షణ కథలతో అలరిస్తున్నారు. యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన అభిమానులను కూడగట్టుకున్న ఈ హీరో మరికొద్ది రోజుల్లో తీస్ మార్ ఖాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ నేపథ్యంలో తీస్ మార్ ఖాన్ నిర్మాత తమ విజ‌న్ సినిమాస్ ఆఫీసులో ఆది సాయి కుమార్ బర్త్ డే వేడుకను ఘనంగా నిర్వహించారు. పలువురు సన్నిహితుల మధ్య జరిగిన ఈ పార్టీలో ఆది సాయి కుమార్ చేత కేక్ కట్ చేయించి ఆయనకు ఆల్ ది బెస్ట్ చెప్పింది తీస్ మార్ ఖాన్ టీమ్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తీస్ మార్ ఖాన్ దర్శకనిర్మాతలు నాగం తిరుప‌తి రెడ్డి, కళ్యాణ్ జి గోగణ.. ఆది సాయి కుమార్‌కి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ యాక్షన్ ప్యాక్డ్ మూవీ తీస్ మార్ ఖాన్ ఘన విజయం సాధించాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతకు కృతజ్ఞతలు చెప్పిన ఆది సాయి కుమార్.. ముందు ముందు మరిన్ని వినూత్న కథలతో అలరిస్తానని అన్నారు.  

ఇక తీస్ మార్ ఖాన్ సినిమా విషయానికొస్తే.. విజ‌న్ సినిమాస్ బ్యాన‌ర్‌పై నాగం తిరుప‌తి రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. నాటకం ఫేమ్ కళ్యాణ్ జి గోగణ దర్శకత్వం వహిస్తున్నారు. RX 100 సినిమాతో యువతను ఆకట్టుకున్న పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటిస్తోంది. సునీల్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ గ్లాన్స్ ఆది సాయి కుమార్ బర్త్ డే కానుకగా రిలీజ్ చేయగా.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకుంటోంది. 

రీసెంట్‌గా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఈ వీడియోలో ఆది సాయికుమార్ పవర్ ప్యాక్డ్ లుక్‌లో కనిపించి సినిమాపై హైప్ పెంచేశారు. సాయి కార్తీక్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. అతి త్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.

కాస్ట్: ఆది సాయికుమార్, పాయల్ రాజ్‌పుత్, సునీల్, అనూప్ సింగ్ ఠాకూర్, కబీర్ సింగ్, పూర్ణ.

సాంకేతిక నిపుణులు: బ్యానర్ : విజన్ సినిమాస్, డైరెక్టర్ : కళ్యాణ్ జి గోగణ, ప్రొడ్యూసర్ : నాగం తిరుపతి రెడ్డి, ఎగ్జిక్యూటివ్  ప్రొడ్యూసర్ : తిర్మల్ రెడ్డి యాళ్ళ, మ్యూజిక్ : సాయి కార్తీక్, ఎడిటర్ : మణికాంత్, నిమాటోగ్రాఫర్: బాల్ రెడ్డి, పీఆర్.ఒ : సాయి సతీష్, పర్వతనేని రాంబాబు.

Adi Sai Kumar Birthday Celebration:

Tees Mar Khan Team Says Best Wishes to Adi Sai Kumar

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ