క్షత్రియ సమితి అద్వర్యం లో ఆదివారం ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ లో స్వాతంత సమర వీరుడు అల్లూరి సీతారామ రాజు 125 వ జయంతి ఉత్సవాలు జరిగాయి. కృష్ణ గారు నటించి నిర్మించిన అల్లూరి సీతారామ రాజు చిత్రం ఆ పోరాట యోధుని జీవిత చరిత్ర ఆధారంగా తీసినదే. తెలుగు వారందరికీ అల్లూరి సీతారామ రాజు అంటే ఏమిటో పరిచయం చేసిన చిత్రం ఇదొక్కటే. అలాగే ఈ చిత్రం తెలుగు చలన చిత్ర సీమ చరిత్ర లో చిరస్థాయిగా ఉండిపోయే చిత్రం. అటువంటి అల్లూరి సీతారామ రాజు మీద ఒక సినిమా తీసి నటించినందుకు క్షత్రియ సమితి వారు కృష్ణ గారిని సన్మానించారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఆంధ్ర మరియు తెలంగాణ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస రావు కూడా ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.
అలాగే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఒక కార్యక్రమం లో భాగంగా ఇలా బయటకి తెలియని స్వంతత్ర సమర వీరుల చరిత్ర చెప్పాలన్నది కూడా ఇంకో ముఖ్య ఉద్దేశం. అయితే ఈ సమావేశానికి వచ్చిన వారందరు కృష్ణ గారిని అతనికి సినిమా పట్ల వున్న అభిరుచుని, అలాగే అతని గుణ గణాలను పొగిడారు. చివరగా మంత్రులకు, రాజకీయ నాయకులకి, సినిమా వాళ్ళకి సినీ పాత్రికేయుల తరుపున సీనియర్ జర్నిలిస్ట్ ప్రభు ఓ విన్నపం చేశారు. కృష్ణ గారు సినిమా రంగానికి ఇచ్చే అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వాలని, వివాదాలకు, పార్టీలకు దూరంగా ఉంటున్న కృష్ణ గారు అందుకు అన్ని విధాలా అర్హులు అని, ఈ విషయం అందరూ ఆలోచించి త్వరగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరి మన తెలుగు మంత్రులు కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయం విన్నవిస్తారో లేదో చూడాలి.