చిన్నప్పుడే సినిమాలు చూడ్డం, వాటిని ఇంటికి వచ్చాక వివరించే విధానంతో తెలీకుండా వారిలో ఒకరు రచయితగా మారారు. తల్లిదండ్రులు వీరి ఆసక్తిని గ్రహించి ఎప్పటికైనా మంచి సినిమాలు తీస్తారని అనుకునేవారట. అలాగే వారు ఇప్పుడు నిర్మాతలుగా మారారు. వారే రాజాబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల. వీరి సోదరుడు మిర్యాల రవీందర్ రెడ్డి అఖండ నిర్మాత. ఇక రాజాబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల తీసిన సినిమా అతిధి దేవో భవ. పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వం వహించారు. ఆది సాయి కుమార్, నువేక్ష హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం జనవరి 7న విడుదలవుతుంది. ఈ సందర్భంగా సోమవారంనాడు నిర్మాతలు విలేకరులతో తమ అనుభవాలను ఇలా పంచుకున్నారు
- ఒమిక్రాన్ వైరస్‌తో సినిమా పరిశ్రమ కాస్త గందరగోళంగా వున్నా మా అతిధి దేవో భవ చిత్రాన్ని కథపై వున్న నమ్మకంతో విడుదల చేస్తున్నాం. ఇందులో యూత్‌తోపాటు ఫ్యామిలీ అంశాలున్నాయి. అది సాయికుమార్ కెరీర్‌లో బెస్ట్ చిత్రమవుతుంది.
- ఈ సినిమా కథ వేణుగోపాల్ ది. స్క్రీన్ ప్లే నేను, మా వదిన రాశామని అశోక్ రెడ్డి మిర్యాల తెలిపారు. సంభాషణలు కూడా నేను రాయడానికి చిన్నతనం నుంచి వున్న పరిశీలనతోపాటు లెక్చరర్‌గా చేసిన అనుభవం కూడా దోహదపడింది. సినిమాపై మక్కువతోనే లెక్చరర్ ఉద్యోగ్యం వదిలేసి వచ్చాను.
- ఈ చిత్రం జోనర్ ఎటువంటిది అని చెప్పాలంటే మొదటి భాగం లవబుల్‌గా వుంటుంది. సెకండాఫ్ థ్రిల్లింగ్ ఎమోషన్స్ వున్నాయి. ట్రైలర్‌లో చూసినట్లుగా హార్రర్ కథ మాత్రం కాదు.
- మా సోదరుడు రాజాబాబు వ్యాపార రంగంలో వున్నాడు. మరో సోదరుడు అఖండ వంటి సినిమాలు తీస్తున్నాడు. నేను లెక్చరర్‌గా వున్నా సినిమాలు ఎక్కువగా చూడడంతో ఎప్పటికైనా దర్శకత్వం చేయాలనేది నా గోల్. అందుకే మొదటగా ఒక మంచి సినిమా చేయాలని ‘అతిధి దేవో భవ’ సినిమా చేశాం.
- మా సినిమాకు ఈరోజే సెన్సార్ పూర్తయింది. యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. మంచి సినిమా తీశారని ప్రశంస దక్కింది. అదేవిధంగా ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం హైలైట్‌గా వుంటుంది.
- మామూలుగా ఈ సినిమాను నవంబర్‌లోనే విడుదల చేయాలనుకున్నాం. కానీ అప్పటికి సంగీతం పనులు పూర్తికాలేదు. అన్నీ పూర్తయ్యాక జనవరి 26న విడుదల చేద్దామని నిర్ణయించాం. కానీ దైవ నిర్ణయం అనుకోకండా ఆర్.ఆర్.ఆర్. వాయిదా పడడం. అదే రోజు సంక్రాంతికి మాకు డేడ్ రావడం అదృష్టంగా భావిస్తున్నాం.
_అతిధి దేవో భవ సినిమాకు ముందుగా కొత్తవారితో అనుకున్నాం. కానీ కథను రాసుకున్నాక మేమూ నిర్మాతలుగా కొత్త కనుక హీరో కొంచెం అనుభవం వున్నవ్యక్తి బెటర్ అనుకుని ఆది సాయికుమార్‌ను ఎంపిక చేశాం. అదేవిధంగా నాయికగా నువేక్ష నటించింది. ఇద్దరూ కథాపరంగా బాగా నటించారు. నువేక్షకు బాష రాకపోయినా ఎమోషన్స్‌ను బాగా పట్టి కథను సన్నివేశాన్ని మెప్పించింది.
- కొత్త నిర్మాతలకు థియేటర్ల సమస్యలుంటాయని అనుకున్నాం. ఒకరకంగా భయమేసింది కూడా. కానీ కథపై వున్న నమ్మకమే మమ్మల్ని ముందుకు నెట్టింది.
- తొలుత మేము ఓ కథను అనుకున్నాం. కానీ అది చేయాలంటే భారీ బడ్జెట్ అవుతుంది. అందుకే మీడియంగా ఓ సినిమా చేద్దామని ఆదితో ఈ సినిమా చేశాం. చాలా సంతృప్తికరంగా వచ్చింది. మా సోదరుడు రవీందర్ రెడ్డి కూడా ప్రోత్సహించారు.
- ఈ సినిమాలో లవ్, ఎమోషన్స్‌తోపాటు కామెడీ కూడా వుంది. సప్తగిరి, ఇమ్యాన్యుయేట్ ఎంటర్‌టైన్ మెంట్ అందరికీ బాగా నచ్చుతుంది. సప్తగిరి పాత్ర గతంలో చేసిన ప్రేమకథా చిత్రమ్ కంటే బాగుండేలా ప్లాన్ చేశాం. సీనియర్ నటి రోహిణి గారు ఇందులో నటించారు. తను ఎమోషనల్ బాగా పండించారు.
- ఇక చిత్ర దర్శకుడు ఎదుటివారిని అర్థం చేసుకునే వ్యక్తి. ఎవరికి ఏమి కావాలో అని తెలిసుకుని సినిమాను సరైనవిధంగా పూర్తి చేసేలా సహకరించారు.
- ఈ షూటింగ్ టాకీ హైదరాబాద్ లో పాటలు డార్జిలింగ్ చేశాం.
- తొలి సినిమాతో మేము చాలా జ్ఞానం సంపాదించాం. ఏదైనా వ్యాపారం చేస్తే ఒకరితో వుంటుంది. సినిమా కనుక వందమంది చేతిలో వుంటుంది. మొత్తంగా పాజిటివ్ అనుభవాన్ని సంపాదించాం అని తెలిపారు.