Advertisementt

రష్మిక మందన పాటతో చిత్తం మహారాణి

Thu 06th Jan 2022 10:51 AM
chittam maharani,chittam maharani movie,rashmika mandanna,sunel,yajurved,rachana,karthik srinivas  రష్మిక మందన పాటతో చిత్తం మహారాణి
Chittam Maharani song gets thumping response రష్మిక మందన పాటతో చిత్తం మహారాణి
Advertisement
Ads by CJ

సెన్సేషనల్ హీరోయిన్ రష్మిక మందన చేతుల మీదుగా విడుదలైన చిత్తం మహారాణి చిత్రంలోని కోలకళ్ళ చిన్నది పాటకు అనూహ్య స్పందన..

లిటిల్ థాట్స్ సినిమాస్ సమర్పణలు యజుర్వేద్, రచన, సునీల్ కీలక పాత్రల్లో ఏ. కాశీ తెరకెక్కిస్తున్న సినిమా చిత్తం మహారాణి. జెఎస్ మణికంఠ, ప్రసాద్ రెడ్డి టిఆర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి కోలకళ్ళ చిన్నది లిరికల్ సాంగ్ విడుదలైంది. దీనికి అద్భుతమైన స్పందన వస్తోంది. సెన్సేషనల్ హీరోయిన్ రష్మిక మందన ఈ పాటను విడుదల చేశారు. ఈ పాటను ప్రముఖ గాయకుడు రామ్ మిర్యాల ఆలపించారు. ఇప్పటికే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమా ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. గౌర హరి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు కార్తిక్ శ్రీనివాస్ ఎడిటర్. సురేష్ సిద్హాని మాటలు రాస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్ర యూనిట్.

నటీనటులు: యజుర్వేద్, రచన, సునీల్, తులసి, హర్షవర్ధన్, మధునందన్, సత్య, రాజ్ కుమార్ కాశిరెడ్డి, వైవా హర్ష, జబర్దస్త్ అశోక్, నాయని పావని..

టెక్నికల్ టీం: దర్శకుడు:- A కాశీ, నిర్మాతలు:- JS మణికంఠ, ప్రసాద్ రెడ్డి, మాటలు :- సురేష్ సిద్హాని, ఎడిటర్:- కార్తీక శ్రీనివాస్, సంగీతం:- గౌర హరి, DOP:- విశ్వనాథ్ రెడ్డి, యాక్షన్ కొరియోగ్రాఫర్:- డ్రాగన్ ప్రకాష్, కొరియోగ్రాఫర్ :- విజయ్ బిన్నీ, Di:- అన్నపూర్ణ స్టూడియోస్, DI టెక్నికల్ హెడ్:- c.v. రావు, కలరిస్టు:- విష్ణు వర్ధన్ కే, PRO: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్.

Chittam Maharani song gets thumping response:

Rashmika Mandanna unveils Kolakalla Chinnadi from Chittam Maharani

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ