Advertisementt

సమంత జోరులో యశోద సెకండ్ షెడ్యూల్

Thu 06th Jan 2022 05:10 PM
samantha,yashoda movie,pivotal second schedule,samantha yashoda movie  సమంత జోరులో యశోద సెకండ్ షెడ్యూల్
Yashoda movie Pivotal Second Schedule Begins! సమంత జోరులో యశోద సెకండ్ షెడ్యూల్
Advertisement
Ads by CJ

సమంత ప్రధాన పాత్రలో  రూపొందుతున్న చిత్రం యశోద. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. హరి - హరీష్ దర్శకులుగా పరిచయం అవుతున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేశ్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ రోజు (గురువారం, జనవరి 6) సెకండ్ షెడ్యూల్ మొదలైంది.

నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ సమంత ప్రధాన పాత్రలో మా సంస్థలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈ రోజు సెకండ్ షెడ్యూల్ మొదలైంది. ఈ నెల 12 వరకూ ఈ షెడ్యూల్ లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించేలా ప్లాన్ చేశాం. సంక్రాంతి తర్వాత మూడో షెడ్యూల్ స్టార్ట్ చేస్తాం. మార్చి నెలాఖరుకు చిత్రీకరణ పూర్తి అవుతుంది. ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏక కాలంలో విడుదల చేస్తాం అని చెప్పారు.

సమంతతో పాటు వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ తదితరులు ఈ చిత్రం ప్రధాన తారాగ‌ణం. 

Yashoda movie Pivotal Second Schedule Begins!:

Samantha Yashoda movie Pivotal Second Schedule Begins!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ