సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ఆశిష్ రౌడీ బాయ్స్ రిలీజ్
దిల్‌రాజు ప్రొడక్షన్.. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తోన్న చిత్రం రౌడీ బాయ్స్. తెలుగు ప్రేక్షకుల అభిరుచిగా తగినట్లు ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను అందించిన దిల్‌రాజు, శిరీష్ ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అవుతున్నారు ఆశిష్(శిరీష్ తనయుడు). ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల చేస్తున్నారు.
నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్ మాట్లాడుతూ.. రౌడీ బాయ్స్ కాలేజ్ బ్యాక్ డ్రాప్‌లో సాగే యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్. మా ఫ్యామిలీ నుంచి ఆశిష్ హీరోగా పరిచయం అవుతుండటం చాలా హ్యాపీగా ఉంది. అలాగే మా బ్యానర్ వేల్యూస్‌ను దృష్టిలో పెట్టుకుని రౌడీ బాయ్స్ చిత్రాన్ని యూత్ సహా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా రూపొందించాం. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ఈ సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఎప్పటిలాగే ప్రేక్షకులు మా హీరోని, బ్యానర్‌ని ఆశీర్వదిస్తారని భావిస్తున్నాం. మొదటి సినిమా అయినప్పటికీ ఫుల్ ఎనర్జీతో ఆశిష్ చేసిన డాన్సులు, ఫెర్ఫామెన్స్ అందరినీ ఆకట్టుకుంటాయి. ఆశిష్‌తో పాటు విక్రమ్ కూడా మంచి పాత్రలో నటించాడు. ఇక అనుపమ పరమేశ్వరన్‌తో మాకు ఎంతో మంచి అనుబంధం ఉంది. ఆమె మా ఎస్‌వీసీ బ్యానర్లో చేసిన మూడో సినిమా. తనదైన నటనతో మెప్పిస్తుంది. ఇక మది సినిమాటోగ్రపీ, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు పెద్ద ఎసెట్‌గా నిలుస్తాయి అన్నారు.