Advertisementt

పెద్ద సినిమాతో ఎంట్రీ, నటుడిగా చాలా క్రేజ్

Sun 09th Jan 2022 10:05 AM
ramesh babu,mahesh babu,ramesh babu no more,krishna son  పెద్ద సినిమాతో ఎంట్రీ, నటుడిగా చాలా క్రేజ్
Ramesh babu Movie Updates పెద్ద సినిమాతో ఎంట్రీ, నటుడిగా చాలా క్రేజ్
Advertisement
Ads by CJ

బాలనటుడిగా పెద్ద సినిమాతో ఎంట్రీ

రమేష్ బాబు, కృష్ణ ఇందిరా దేవిలకు 1965అక్టోబర్‌ 13న చెన్నైలో జన్మించారు. కృష్ణ గారి కుటుంబం లో రమేష్ బాబునే పెద్దవాడు. తరువాతనే మంజుల, పద్మావతి, ప్రియదర్శిని, మహేష్‌బాబు జన్మించారు. అలాగే రమేష్ బాబు చాల అందంగా వుండే వాడు. అప్పట్లో రమేష్ బాబు ని చూసి చాలామంది ఇంత హ్యాండ్సమ్ గా వున్నాడు కృష్ణ గారి తరువాత రమేష్ బాబే పెద్ద హీరో అని అనేవారు. రమేష్ బాబు కి కూడా చిన్నప్పటి నుంచే యాక్టింగ్ మీద ఇంటరెస్ట్ ఉండేది. బాల నటుడిగా అతని ఎంట్రీ తెలుగు సినిమా చరిత్ర లోనే ఒక చరిత్ర సృష్టించిన అల్లూరి సీతారామరాజు లో చిన్నప్పటి అల్లూరి గా రమేష్ బాబు నటించారు. అప్పటి నుండే రమేష్ అంటే చాలా క్రేజ్ ఉండేది. ఆ తరువాత మనుషులు చేసిన దొంగలు లో కూడా బాల నటుడిగా వేశారు. తరువాత దొంగలకు దొంగ, అన్నదమ్ముల సవాల్ లాంటి సినిమాల్లో కూడా బాల నటుడిగా వేశారు రమేష్ బాబు. మహేష్ కి బాలనటుడిగా ఎంత క్రేజ్ ఉందొ, అంతే క్రేజ్ రమేష్ బాబు కి కూడా వుంది. రమేష్ బాబు కూడా అచ్ఛం వారి అమ్మ ఇందిరా దేవి పోలిక.

ముగ్గురు కొడుకులుగా తండ్రి కొడుకులు

కృష్ణ గారు తన దర్శకత్వంలో ఎక్కువ రమేష్ బాబు ని తీసుకున్నారు. కలియుగ కర్ణుడు అనే సినిమాలో రమేష్ బాబు ని కూడా ఒక హీరో గా పెట్టారు. అలాగే ముగ్గురు కొడుకులు అన్న సినిమాలో రమేష్ బాబు తో పాటు మహేష్ బాబు కూడా నటించాడు. అయితే మహేష్ బాల నటుడిగా చేసాడు. ఇందులో కృష్ణ గారు, అతని ఇద్దరి అబ్బాయిలు అయినా రమేష్, మహేష్ అందరూ అన్నదమ్ముల్లా నటించటం విశేషం. ఈ సినిమా అప్పట్లో చాలా బాగా ఆడింది. తరువాత రమేష్ బాబు మధ్యలో కొన్ని సినిమాల్లో చేసినా అంతగా ఆడలేదు, ఏవీ కలిసి రాలేదు. దానికి తోడు, బరువు కూడా పెరగటంతో యాక్టింగ్ కి దూరం అయ్యాడు. కృష్ణ గారు నటించిన పీపుల్స్ ఎన్కౌంటర్ అనే సినిమాలో రమేష్ బాబు కూడా ఒక కీలక పాత్ర వేశారు. ఇదే నటుడిగా రమేష్ బాబు ఆఖరి సినిమాగా చెప్పొచ్చు. ఆలా నటనకు దూరం అయ్యి, నిర్మాతగా మారి అక్కడ కూడా అంత విజయాలు సాధించలేక, సినిమా ఇండస్ట్రీ కి దూరం అయ్యారు. ఎవరికీ ఎటువంటి అపకారం తలపెట్టని, ఎటువంటి వివాదాల్లో లేని, ఒక మంచి మనిషి రమేష్ బాబు. అటువంటి రమేష్ బాబు ఆకస్మిక మరణం కృష్ణ గారి కుటుంబలో చాలా పెద్ద విషాదాన్ని మిగిల్చింది.

Ramesh babu Movie Updates:

Mahesh Babu Brother Ramesh Babu No More

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ