Advertisementt

నాగ్ బంగార్రాజుతో బుల్లితెరపై సంక్రాంతి సెలెబ్రేషన్స్

Sun 09th Jan 2022 08:26 PM
sankranthi,bangarraju,sankranthi sambaralu,nagarjuna,zee telugu  నాగ్ బంగార్రాజుతో బుల్లితెరపై సంక్రాంతి సెలెబ్రేషన్స్
SANKRANTHI SAMBARALU WITH BANGARRALU నాగ్ బంగార్రాజుతో బుల్లితెరపై సంక్రాంతి సెలెబ్రేషన్స్
Advertisement
Ads by CJ

నాగార్జున వాస్సీవాడి తస్సాదియ్యా అంటూ ఈ సంక్రాంతికి బోలెడంత సంబరాన్ని తీసుకొచ్చారు. జీ తెలుగుతో కలిసి సంక్రాంతి సంబరాల్ని ఘనంగా సెలబ్రేట్ చేశారు. ఈ ఎక్స్ క్లూజివ్ సంక్రాంతి సంబరాల్ని మీ జీ తెలుగులో జనవరి 14వ తేదీ, శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి చూసి ఎంజాయ్ చేయండి.

కేరళలో అట్టహాసంగా జరిగిన ఈ సంక్రాంతి సంబరాల కోసం హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా హీరోలు నాగార్జున, నాగచైతన్య, అందాల ముద్దుగుమ్మ కృతిషెట్టి కేరళ వెళ్లారు. జీ తెలుగు కుటుంబంతో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు. ఒకే వేదికపై అక్కినేని తండ్రికొడుకులు నాగార్జున, నాగచైతన్య అలా కలిసి నడిసొస్తుంటే.. వాసీవాడితస్సాదియ్యా.. ఇది కదా పండగ అనిపించింది.

ఈ సంక్రాంతి కోసం చాలా సంబరాలు మోసుకొచ్చింది జీ తెలుగు. ప్రముఖ హాస్యనటుడు అలీ తో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ఇక హీరోయిన్ పూర్ణ స్పెషల్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. వీటితో పాటు జీ తెలుగు సీరియల్స్ లో నటించిన స్టార్ ఆర్టిస్టులు చాలామంది తమ పెర్ఫార్మెన్స్ తో సంక్రాంతి సంబరాల్ని కలర్ ఫుల్ గా మార్చేశారు. ఉదయభాను యాంకరింగ్ మరో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనుంది. బంగార్రాజుతో కలిసి ఆమె చిందులేసి, షోను రక్తికట్టించారు.

బంగార్రాజు మెరుపులు, నాగచైతన్య హంగామా, కృతిషెట్టి అందాలతో ఈ సంక్రాంతి సంబరాల్ని తెలుగు ప్రేక్షకులకు గ్రాండ్ గా అందిస్తోంది మీ జీ తెలుగు కుటుంబం. కమ్.. లెట్స్ సెలబ్రేట్..

బంగార్రాజుతో సంక్రాంతి సంబరాలు.. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి.. మీ జీ తెలుగులో.. డోంట్ మిస్

SANKRANTHI SAMBARALU WITH BANGARRALU :

SANKRANTHI SAMBARALU WITH BANGARRALU Exclusively in Zee Telugu

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ