Advertisementt

డి జె టిల్లు విడుదల వాయిదా

Mon 10th Jan 2022 06:28 PM
dj tillu,dj tillu movie,dj tillu movie release,siddu jonnalagadda  డి జె టిల్లు విడుదల వాయిదా
DJ Tillu Movie Release Date Postpone డి జె టిల్లు విడుదల వాయిదా
Advertisement
Ads by CJ

సిద్ధు జొన్నలగెడ్డ నటించిన డి జె టిల్లు సంక్రాంతి బరిలో ఉందని అధికారికంగా ప్రకటించారు. కానీ ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పని చాలా ఉందని అంటున్నారు. అదీ కాకుండా మొన్నటి వరకు షూటింగ్ కూడా చేసారు. తొందర తొందరగా చేసే బదులు, కొంచెం టైం తీసుకుని విడుదల చేస్తే బాగుంటుంది అని నిర్మాతలు మరియు సిద్ధు అభిప్రాయం. అదీ కాకుండా, పండగ అని చెప్పి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గనక సినిమా హాల్స్ లో సగం మాత్రమే నింపాలి అంటే మాత్రం, ఈ సినిమా కి చాలా పెద్ద దెబ్బె తగులుతుందని అంటున్నారు. నిర్మాతలకి ఈ సినిమా విడుదల కాకుండానే విపరీతమైన లాభాలు వచ్చేసాయి. 

ఈ సినిమా థియేట్రికల్ హక్కులు వెంకట్ అనే అతను 7.5 కోట్లకు కొనుక్కున్నారు. ఈ సినిమాకి ఇది చాలా ఎక్కువ అంటున్నారు. ఈ సినిమాని సుమారు మూడు కోట్లలో తీశారు అని వినికిడి. ఇదే కాకుండా, ఈ సినిమాకి ఓ టి టి మరియు సాటిలైట్ హక్కులు కూడా మంచి డబ్బులు వచ్చాయి. అందువల్లే ఈ సినిమా ఆ నిర్మాతలకి ఇప్పటికే కాసుల వర్షం కురిపించింది. ఇలా ఈ సినిమా మీద ఇంత డబ్బు వున్నప్పుడు ఎందుకు హడావిడిగా విడుదల చెయ్యటం అని ఆ నిర్మాతలు, దర్శకుడు మరియు సిద్ధు ఆలోచిస్తున్నారు. కానీ ఇంకో రెండు రోజుల వరకు చూసి అప్పుడు అధికారికంగా ఏదైనా చెయ్యాలి అని చూస్తున్నారు. సోషల్ మీడియా లోనే ప్రమోషన్స్ చేస్తున్నారు కానీ, ఇంకా టీం ఎక్కడికి పోవటం లేదు. ఇవన్నీ ఆలోచిస్తే సినిమాని జనవరి 26 కి పోస్ట్ పోన్ చేయొచ్చు అని టాక్ వినపడుతోంది.

DJ Tillu Movie Release Date Postpone:

DJ Tillu movie Postpone of release date

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ