శ్రీ అనుపమ ప్రొడక్షన్ పతాకంపై డాక్టర్ అక్కినేని నాగేశ్వర రావు, లక్ష్మితో మోహన్ గాంధీ దర్శకత్వంలో రూపొందించిన ప్రాణదాత సినిమాకు జనవరి 14తో 30 ఏళ్ళు, ఈ సినిమాను పి.బలరాం, కాట్రగడ్డ ప్రసాద్ నిర్మించారు.
నేను నిర్మించిన సినిమాల్లో ప్రాణదాత కు ఎన్నో ప్రత్యేకతలు వున్నాయి. నా అభిమాన హీరో అక్కినేని నాగేశ్వర రావు గారితో నేను నిర్మించిన మొదటి సినిమా ప్రాణదాత. ఇది పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో నిర్మించాము . మహానటుడు నాగేశ్వర రావు గారు ఎలాంటి ఆడంబరాలు లేకుండా మాతో పాటు గుడ్లవలేరు లాటి పల్లెటూరిలో వున్నారు . క్రమశిక్షణ కు మారు పేరు నాగేశ్వర రావు గారు. ఆయన నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ప్రాణదాత సినిమా ఎన్నో మధుర స్మృతులను మిగిల్చిన దని నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ చెప్పారు.
నాకు చిన్నప్పటి నుంచి అక్కినేని నాగేశ్వర రావు అంటే ఎంతో అభిమానం, పంపిణీదారుగా వున్న నేను సినిమా నిర్మాణంలోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు. నాగేశ్వర రావు గారితో ప్రాణదాత, కాలేజీ బుల్లోడు రెండు సినిమాలు రూపొందిస్తానని కూడా అనుకోలేదు. ఆ రెండు సినిమాల నిర్మాణం జీవితంలో మర్చిపోలేను అని చెప్పారు ప్రసాద్.
1991లో పరుచూరి బ్రదర్స్ తో కలసి హైదరాబాద్ బంజారా హిల్స్ లో వున్న నాగేశ్వర రావు గారి ఇంటికి వెళ్ళాను. ఆయన కథ వినగానే వెంటనే ఒప్పుకున్నారు. అప్పుడు చెప్పను నేను మీ అభిమానినని, ఆ మాట విని ఆయన ఎంతో సంతోషపడ్డారు బని ప్రసాద్ తెలిపారు .ప్రాణదాత సినిమా 1992 జనవరి 14న విడుదలై ఘనవిజయం సాధించింది అని చెప్పారు కాట్రగడ్డ ప్రసాద్.
Click Here: Katragadda Prasad Video Bite