Advertisementt

మా హీరో కు పాజ‌టివ్ టాక్ -నిర్మాత గల్లా పద్మావతి

Sat 15th Jan 2022 07:56 PM
hero,hero movie,ashok galla,nidhi agarwal,padhmavathi galla,hero movie success meet  మా హీరో కు పాజ‌టివ్ టాక్ -నిర్మాత గల్లా పద్మావతి
Thanks to the audience for supporting the Hero movie మా హీరో కు పాజ‌టివ్ టాక్ -నిర్మాత గల్లా పద్మావతి
Advertisement
Ads by CJ

మా తొలి ప్ర‌య‌త్నం హీరో చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్ష‌కుల‌కు ధ‌న్య‌వాదాలు -నిర్మాత గల్లా పద్మావతి

అశోక్ గల్లా నిధి అగర్వాల్ హీరో హీరోయిన్లుగా న‌టించిన చిత్రం హీరో. శ్రీ‌రామ్ ఆదిత్య ద‌ర్శ‌కుడు. ఈ చిత్రాన్ని అమర్ రాజా మీడియా అండ్  ఎంటర్టైన్మెంట్స్ ప‌తాకంపై శ్రీ‌మ‌తి గల్లా పద్మావతి నిర్మించారు. సంక్రాంతి కానుక‌గా జనవరి 15న విడుదలయి పాజ‌టివ్ టాక్ ను సంత‌రించుకుంది. ఈ సంద‌ర్భంగా శ‌నివారం నాడు చిత్ర యూనిట్ ప్రేక్ష‌కుల‌కు ధ‌న్య‌వాదాలు తెలుపుతూ త‌మ ఆనందాన్ని సంస్థ కార్యాల‌యంలో విలేక‌రుల‌తో పంచుకున్నారు.

ద‌ర్శ‌కుడు శ్రీ‌రామ్ ఆదిత్య ఆనందాన్ని వ్య‌క్తం చేస్తూ, చాలా రోజుల త‌ర్వాత థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ఎన‌ర్జీని చూశాను. అది మాకు మ‌రింత ఉత్సాహాన్నిచ్చింది. అన్ని ఏరియాల్లో సూప‌ర్ పాజిటివ్ రిపోర్ట్ వ‌చ్చింది. హీరో అశోక్‌ను చూసిన వారంతా మాస్ హీరో అంటూ సంబోధిస్తూ, అశోక్‌కు ఇది మొద‌టి సినిమాలా లేద‌ని అంటున్నారు. మాకు సంక్రాంతి విజ‌యం ద‌క్కింది. మీకూ సంక్రాంతి ఇవ్వ‌డానికి థియేట‌ర్ల‌లోనే వున్నాం. ఇంకా చూడ‌నివారు చూసి ఆనందించండి అని పేర్కొన్నారు.

క‌థానాయ‌కుడు అశోక్ గ‌ల్లా మాట్లాడుతూ, తొలి సినిమాకే నాకు ప్రేక్ష‌కుల ఆశీర్వాదాలు క‌లగ‌డం ఆనందంగా వుంది. ఈరోజు థియేట‌ర్‌కు టీమ్‌తో క‌లిసి వెళ్ళాను. ప్రేక్ష‌కుల రియాక్ష‌న్ చూస్తుంటే నాలో తెలీని ఎన‌ర్జీ వ‌చ్చింది. తొలీ సినిమా అనుభూతి ఎంక‌రేజ్ గా  వుండ‌డం అదృష్టంగా వుంది. ద‌ర్శ‌కుడు, ఎడిట‌ర్ టీమ్ అంతా ఈ సినిమాకు చ‌క్క‌గా పనిచేశారు. ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా వున్న ఈ సినిమా అంద‌రూ చూడ‌ద‌గ్గ సినిమా అని తెలిపారు.

హీరోయిన్ నిధి అగర్వాల్ తెలుపుతూ, నాకు చాలా సంతోషంగా వుంది. పాజిటివ్ రెస్పాన్స్ రావ‌డం బాగుంది. అశోక్‌కు పెద్ద హిట్ ఇచ్చారు. నేను ఈరోజు సినిమా చూశాను. చాలా ఇంప్రెసివ్‌గా వుంది. ద‌ర్శ‌కుడు, ఎడిట‌ర్ చాలా చ‌క్క‌గా ప‌నిచేశారు. కామెడీని ద‌ర్శ‌కుడు బాగా డీల్ చేశాడు. అశోక్ హీరో పాత్ర‌లో అమ‌రాడు. ప్రేక్ష‌కుల‌కు, సూప‌ర్ స్టార్ అభిమానుల‌కు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాన‌ని తెలిపారు.

చిత్ర నిర్మాత శ్రీ‌మ‌తి గల్లా పద్మావతి మాట్లాడుతూ, ఈరోజు దేవీ థియేట‌ర్‌లో చూశాం. ప్రేక్ష‌కులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పాజిటివ్ టాక్ తొలి సినిమాకు రావ‌డం ప్రోత్సాహంగా వుంది. అందుకే ప్రేక్ష‌కుల‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేయాల‌నుకున్నాం. అంద‌రికీ కామెడీ బాగా న‌చ్చింది. హిలేరియ‌స్ కామెడీ, థ్రిల్లింగ్ మూవీ ఇది. పేండ‌మిక్ టైమ్‌లో కాస్త రిలీఫ్‌గా వుండే సినిమానే హీరో చిత్రం. సంక్రాంతికి పండుగ చేసుకుంటూ మా హీరో సినిమాను చూసి మ‌రింత ఎంజాయ్ చేయండ‌ని అన్నారు.

గాయ‌కుడు రోల్ రిడా మాట్లాడుతూ, ఈ ఏడాదిలో పెద్ద బిగినింగ్‌తో నా కెరీర్ మొద‌లైంది. థియేట‌ర్‌లో చూసిన‌ప్పుడు మా వెనుక ప్రేక్ష‌కుల ఎంజాయ్ చేస్తుంటే మాకు మ‌రింత ఎన‌ర్జీ వ‌చ్చింది. శ్రీ‌రామ్‌తో ఎటువంటి రియాక్ష‌న్ షూటింగ్ టైంలో చూశానో అదే ఈరోజు కూడా చూశాను. సీనియ‌ర్ హీరోల‌కు పాడినా అశోక్‌కు పాడిన అనుభూతి కొత్త‌గా వుంది. స్నేహితులు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నామ‌ని చెబుతున్నారు. సంక్రాంతికి గుడ్ బిగినెంగ్ క‌లిగించినందుకు అంద‌రికీ ధ‌న్య‌వాదాలు తెలిపారు.

Thanks to the audience for supporting the Hero movie:

Hero movie success meet

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ