Advertisementt

స్టాండప్ రాహుల్ నుంచి పదా సాంగ్ రిలీజ్

Tue 18th Jan 2022 06:09 PM
rashmika mandanna,padhaaa song,raj tarun,santo mohan veeranki,dream town productions,highfive pictures,stand up rahul movie  స్టాండప్ రాహుల్ నుంచి పదా సాంగ్ రిలీజ్
Rashmika Launched Padhaaa Song From Stand Up Rahul స్టాండప్ రాహుల్ నుంచి పదా సాంగ్ రిలీజ్
Advertisement
Ads by CJ

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో రాజ్ తరుణ్‌ స్టాండప్ రాహుల్ సినిమాతో శాంటో మోహన్ వీరంకి  దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు.  ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా రాబోతన్న ఈ సినిమాను డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ అండ్ హైఫైవ్ పిక్చర్స్ బ్యానర్ల మీద నంద కుమార్ అబ్బినేని,  భరత్ మాగులూరి నిర్మించారు.

నేడు (జనవరి 18) రష్మిక మందన ఈ సినిమా నుంచి పదా అనే పాటను విడుదల చేశారు. నలుగురు స్నేహితులు రోడ్ ట్రిప్‌లో వెళ్తుంటారు. ఇక ఈ విజువల్స్ చూస్తుంటే.. రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మల మధ్య స్నేహానికి మించిన బంధమేదో ఉన్నట్టు కనిపిస్తోంది. రెహమాన్ రాసిన సాహిత్యం.. రాజ్ తరుణ్, వర్షల మధ్య ఇష్టాన్ని తెలియజేసేలా ఉంది.

స్వీకర్ అగస్తి మంచి మెలోడీ ట్యూన్‌ను అందించారు. యాజిన్ నాజర్ గాత్రం చక్కగా కుదిరింది. శ్రీరాజ్ రవీంద్రన్ ఈ సినిమాకు సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరిస్తున్నారు. రాజ్ తరుణ్ లుక్స్ ట్రెండీగా ఉన్నాయి. వర్ష బొల్లమ్మ క్యూట్‌గా కనిపిస్తున్నారు.

జీవితంలో ఏ విషయానికి కూడా నిల్చోవడానికి ఇష్టపడని వ్యక్తి.. స్టాండప్ కమెడియన్‌గా మారుతాడు. అలాంటి యువకుడి జీవితంలోకి నిజమైన ప్రేమ ఎదురవుతుంది. తన తల్లిదండ్రుల గురించి, ప్రేమ గురించి, తన స్టాండప్ కామెడీ గురించి కష్టపడాల్సి వస్తుంది.

ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదల చేసిన టీజర్, పోస్టర్లు అన్నీ కూడా సినిమా మీద అంచనాలను పెంచేశాయి.

Rashmika Launched Padhaaa Song From Stand Up Rahul:

Rashmika Mandanna Launched Padhaaa Song From Raj Tarun, Santo Mohan Veeranki, Dream Town Productions and HighFive Pictures Stand Up Rahul

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ