Advertisementt

అశోక వనంలో అర్జున కళ్యాణం నుంచి సాంగ్

Wed 19th Jan 2022 07:11 PM
ashoka vanamlo arjuna kalyanam,vishwak sen,oo aadapilla song promo,ashoka vanamlo arjuna kalyanam movie song  అశోక వనంలో అర్జున కళ్యాణం నుంచి సాంగ్
Oo Aadapilla from Ashoka Vanamlo Arjuna Kalyanam released అశోక వనంలో అర్జున కళ్యాణం నుంచి సాంగ్
Advertisement
Ads by CJ

మాట రాని మాయ‌వా

మాయ జేయు మాట‌వా

మాటులోని మ‌ల్లెవా

మ‌ల్లె మాటు ముల్లువా

వ‌య్యారివా.. క‌య్యారివా

సింగారివా..సింగాణివా

రాయంచ‌వా.. రాకాసివా

లే మంచులో లావా నీవా

ఓ ఆడ‌పిల్లా నువ్వ‌ర్ధం కావా

నా జీవితంతో ఆటాడుతావా... 

అంటూ  అర్జున్ (విశ్వ‌క్ సేన్‌) త‌న ప్రేయ‌సి (రుక్స‌ర్ థిల్లాన్‌) కోసం పాట పాడుతున్నారు. అస‌లు వీరి క‌థేంటో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందేనంటున్నారు ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ మేకర్స్. ఫ‌ల‌క్‌నుమాదాస్ నుంచి పాగ‌ల్ వ‌రకు వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌తో మెప్పిస్తున్న యంగ్ హీరో విశ్వక్ సేన్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న తాజా చిత్రం అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం. ప్ర‌ముఖ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ స‌మర్ఫ‌ణ‌లో ఎస్‌వీసీసీ డిజిట‌ల్ బ్యాన‌ర్‌పై బాపినీడు, సుధీర్ ఈద‌ర‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజావారు రాణిగారు మూవీ డైరెక్టర్ రవి కిరణ్ కోలా ఈ చిత్రానికి కథ- మాట‌లు, స్క్రీన్ ప్లే అందిస్తుండగా విద్యాసాగ‌ర్ చింతా డైరెక్ట్ చేస్తున్నారు. బుధ‌వారం ఈ సినిమా నుంచి ఓ ఆడపిల్ల నువ్వర్ధం కావా.. అనే పాట‌ను చిత్ర యూనిట్‌ విడుద‌ల చేసింది. 

సినిమా ప్రారంభం నుంచి ఈ సినిమాకు డిఫ‌రెంట్‌గా ప్ర‌మోష‌న్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇది వ‌ర‌కు హీరో విశ్వ‌క్ సేన్ పాత్ర అర్జున్ అని, త‌న‌కు ముప్పై ఏళ్లు అవుతున్నా పెళ్లి కావ‌డం లేద‌ని జుట్టు పోతుంద‌ని, పొట్ట వ‌చ్చేస్తుంద‌ని క్యారెక్ట‌ర్‌ను చ‌క్క‌గా రివీల్ చేశారు. అలాగే రీసెంట్‌గా విశ్వ‌క్ సేన్ త‌న‌కు అమ్మాయి దొరికేసిందంటూ సోష‌ల్ మీడియాలో చేసిన పోస్ట్‌కు కూడా మంచి స్పంద‌నే వ‌చ్చింది. ఇప్పుడు విడుద‌ల చేసిన బ్రీజి మెలోడియ‌స్ సాంగ్ ఓ ఆడ‌పిల్లా నువ్వ‌ర్ధం కావా.. ఆకట్టుకుంటోంది. 

Oo Aadapilla from Ashoka Vanamlo Arjuna Kalyanam released :

Oo Aadapilla from Ashoka Vanamlo Arjuna Kalyanam melody mesmerise

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ