Advertisementt

జీ 5 లో సుమంత్ మళ్ళీ మొదలైంది

Fri 21st Jan 2022 03:03 PM
zee5,malli modalaindi,malli modalaindi movie,malli modalaindi ott movie,sumanth,director tg keerthi kumar  జీ 5 లో సుమంత్ మళ్ళీ మొదలైంది
ZEE5 to Release Sumanth's Malli Modalaindi జీ 5 లో సుమంత్ మళ్ళీ మొదలైంది
Advertisement
Ads by CJ

జీ 5 ఓటీటీలో ఎక్స్‌క్లూజివ్‌గా విడుద‌ల కానున్న‌ సుమంత్ మళ్ళీ మొదలైంది

జీ 5 ఓటీటీ లక్ష్యం ఒక్కటే.. వీక్షకులకు వినోదం అందించడమే. అది కామెడీ కావచ్చు, డ్రామా కావచ్చు, యాక్షన్ కావచ్చు. జానర్ ఏదైనా.. ఆడియ‌న్స్‌ను ఎంట‌ర్‌టైన్ చేయ‌డమే లక్ష్యంగా జీ 5 ఓటీటీ ఎప్పటికప్పుడు విలక్షణ కథలు, కథాంశాలతో రూపొందించిన వైవిధ్యమైన ఒరిజినల్ సిరీస్‌లు, డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్‌లు, కొత్త సినిమాలను అందిస్తోంది. లేటెస్టుగా మరో సినిమాను ఎక్స్‌క్లూజివ్‌గా, డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేయడానికి రెడీ అవుతోంది. సుమంత్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా మళ్ళీ మొదలైంది. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహించారు. ఈడీ ఎంటర్టైన్మెంట్ పతాకం మీద రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ సినిమాను జీ 5 ఓటీటీ ఎక్స్‌క్లూజివ్‌గా విడుదల చేయనుంది. ఓటీటీ రైట్స్‌ను దక్కించుకుంది. ఫిబ్రవరిలో సినిమాను డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

విడాకులు తీసుకున్న ఓ యువకుడు, తన న్యాయవాదితో ప్రేమలో పడితే? అనే కథాంశంతో రూపొందిన సినిమా మళ్ళీ మొదలైంది. ఇందులో సుమంత్ భార్యగా వర్షిణీ సౌందర్ రాజన్, న్యాయవాది పాత్రలో ముఖ్య కథానాయికగా నైనా గంగూలీ నటించారు. ఆల్రెడీ విడుదలైన ఫస్ట్ లుక్ క్యారెక్టర్ పోస్టర్లు, టీజర్, ట్రైలర్ తెలుగు  ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సిద్ శ్రీరామ్ పాడిన ఎలోన్ ఎలోన్ కు అద్భుత స్పందన లభించింది. ఈ సినిమాకు చరణ్ తేజ్ ఉప్పలపాటి సీఈవో. జీ 5 ఓటీటీలో ఈ నెల 21న లూజర్ సీజన్ 2 విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత మళ్ళీ మొదలైంది తో పాటు మరికొన్ని సినిమాలు విడుదల కానున్నాయి.

ZEE5 to Release Sumanth's Malli Modalaindi:

The relationship drama is going to be a ZEE5 exclusive

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ