కరోనా కారణంగా భారీ బడ్జెట్ చిత్రాలన్నీ ప్రమోషన్స్ చేసి మరీ కరోనా కి తలవంచి వెనక్కి తగ్గాల్సి వచ్చింది. కొన్ని రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూలు, వీకెండ్ లాక్ డౌన్స్, 50 శాతం ఆక్యుపెన్సీ కారణంగా థియేటర్స్ మూత బడడంతో.. నిర్మాతలకు లాస్ వస్తుంది అని.. పాన్ ఇండియా మూవీస్ చాలావరకు రిలీజ్ డేట్స్ మార్చుకున్నాయి. ఇప్పుడు ఇదే భారీ సినిమాలకు మేజర్ ప్రాబ్లెమ్ గా మారింది. మేజర్ హీరో అడివి శేష్ కూడా ఇదే మేజర్ ప్రాబ్లెమ్ కోసం వెనక్కి తగ్గాడు.
అడివి శేష్ మొదటి పాన్ ఇండియన్ సినిమా మేజర్ ను ఫిబ్రవరి 11న విడుదల చేయాలని నిర్ణయించారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల కారణంగా మేజర్ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్టు చిత్ర నిర్మాతలు ప్రకటించారు. దేశంలో పలు చోట్ల కర్ఫ్యూలు, కరోనా ఆంక్షలు ఉన్న నేపథ్యంలో చిత్రాన్ని ఫిబ్రవరి 11న రిలీజ్ చేయడం లేదని మేకర్లు ప్రకటించారు.
దేశంలో ప్రస్తుతం పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, కొన్ని చోట్ల కర్ఫ్యూ, మరికొన్ని చోట్ల కరోనా ఆంక్షలు ఉన్న నేపథ్యంలో సినిమాను వాయిదా వేస్తున్నాం. త్వరలోనే మరో విడుదల తేదీని ప్రకటిస్తాం. అందరూ కరోనా నిబంధనలు పాటించండి.. క్షేమంగా ఉండండి. మనలో ప్రతీ ఒక్కరూ క్షేమంగా ఉంటేనే దేశం కూడా సురక్షితంగా ఉంటుంది అని తెలిపారు.
శశి కిరణ్ తిక్క దర్వకత్వం వహిస్తున్న ఈ మూవీ ఒకే సారి తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కించారు. మలయాళంలో కూడా ఈ సినిమాను విడుదల చేయబోతోన్నారు. మేజర్ సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్‌ను ఫస్ట్ సింగిల్ హృదయమా అనే పాటతో మొదలుపెట్టారు. ఈ పాటకు విశేషమైన స్పందన లభించింది.