Advertisementt

ఒకే ఒక జీవితం ఫస్ట్ సాంగ్ అమలకి అంకితం

Wed 26th Jan 2022 06:01 PM
akhil akkineni,sharwanand,oke oka jeevitham,oke oka jeevitham first single,amala akkineni  ఒకే ఒక జీవితం ఫస్ట్ సాంగ్ అమలకి అంకితం
Akhil Akkineni Launches First Single From Sharwanand Oke Oka Jeevitham ఒకే ఒక జీవితం ఫస్ట్ సాంగ్ అమలకి అంకితం
Advertisement
Ads by CJ

యంగ్ హీరో శర్వానంద్ మహా సముద్రం సినిమా తర్వాత కెరీర్ లో 30వ సినిమాగా తెరకెక్కుతోన్న మైల్ స్టోన్ చిత్రం ఒకే ఒక జీవితం. ఈ సినిమా కి కొత్త దర్శకుడు శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయమ‌వుతున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ప‌తాకంపై  ఎస్ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ప్ర‌స్తుతం విడుదలకు సిద్దంగా ఉంది.

జేక్స్ బిజోయ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. నేడు ఈ మూవీ మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభించారు. ఈ చిత్రంలోని అమ్మ పాటను అఖిల్ అక్కినేని విడుదల చేసి త‌న‌ తల్లి అమ‌ల అక్కినేనికి ఈ పాట‌ను అంకితం ఇచ్చారు. ప్రతీ తల్లికి అంకితం ఇచ్చేలా ఈ పాట ఉంటుంది.

ఈ పాట ఎంతో వినసొంపుగా ఉంది. సిధ్ శ్రీరామ్ గాత్రం ప్రత్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. అమ్మ గొప్పదనం చెప్పేందుకు స్వర్గీయ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు అద్భుతమైన సాహిత్యాన్ని సమకూర్చారు. చాలా కాలం తరువాత ఇలా హృదయాన్ని హత్తుకునేలా సాగే అమ్మ పాట ఇది.  ప్ర‌స్తుతం ఈ పాట సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

ఫ్యామిలీ డ్రామాగా రాబోతోన్న ఈ సై-ఫై (సైన్స్ ఫిక్ష‌న్‌) చిత్రానికి సూజిత్ సారంగ్ కెమెరామెన్‌గా, తరుణ్ భాస్కర్ మాటల రచయితగా వ్యవహరించారు.

Akhil Akkineni Launches First Single From Sharwanand Oke Oka Jeevitham :

Akhil Akkineni Launches First Single From Sharwanand Oke Oka Jeevitham And Dedicates It To Amala Akkineni

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ