Advertisementt

ఆడవాళ్లు మీకు జోహార్లు టైటిల్ సాంగ్

Tue 01st Feb 2022 05:54 PM
sharwanand,rashmika mandanna,tirumala kishore,slvc,aadavaallu meeku johaarlu  ఆడవాళ్లు మీకు జోహార్లు టైటిల్ సాంగ్
Aadavaallu Meeku Johaarlu First Single On February 4th ఆడవాళ్లు మీకు జోహార్లు టైటిల్ సాంగ్
Advertisement
Ads by CJ

యంగ్ హీరో శర్వానంద్ క్యూట్ హీరోయిన్ రష్మిక కలయికలో రాబోతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆడవాళ్లు మీకు జోహార్లు. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఫిబ్రవరి 25న విడుదల కాబోతోంది. ఫిబ్రవరి 4వ తేదీ నుంచి నుంచి మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలు కాబోతోన్నాయి. ఫిబ్రవరి 4న టైటిల్ సాంగ్ (ఆడవాళ్లు మీకు జోహార్లు)ను రిలీజ్ చేయబోతోన్నారు. ఫిబ్రవరి 4 సాయంత్రం 4:05 గంటలకు ఈ ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేయనున్నారు. ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్‌లో శర్వా స్టైలీష్‌ లుక్ లో కనిపిస్తున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.

టైటిల్‌ను బట్టి చూస్తే ఇది మహిళా ప్రాధాన్యమున్న చిత్రంగా కనిపిస్తోంది. కుష్బూ, రాధిక శరత్ కుమార్, ఊర్వశీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Aadavaallu Meeku Johaarlu First Single On February 4th:

Sharwanand, Rashmika Mandanna, Tirumala Kishore, SLVC Aadavaallu Meeku Johaarlu First Single On February 4th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ