Advertisementt

ప్రభుత్వ జూనియర్ కళాశాల టైటిల్ లుక్

Mon 07th Feb 2022 11:32 PM
prabhuthva junior kalasala,prabhuthva junior kalasala movie,prabhuthva junior kalasala title look release,praveen singampalli  ప్రభుత్వ జూనియర్ కళాశాల టైటిల్ లుక్
Prabhuthva Junior Kalasala Title Look Release ప్రభుత్వ జూనియర్ కళాశాల టైటిల్ లుక్
Advertisement
Ads by CJ

ప్రభుత్వ జూనియర్ కళాశాల టైటిల్ లుక్ రిలీజ్

యూత్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే సినిమాలను తెరకెక్కించడానికి ఆసక్తి చూపుతున్నారు నేటితరం దర్శకనిర్మాతలు. ఈ క్రమంలోనే ఓ యదార్థ సంఘటనను తీసుకొని ఎంతో ఆసక్తికరంగా మలిచారు డైరెక్టర్ శ్రీనాథ్ పులకురం. దీనికి ప్రభుత్వ జూనియర్ కళాశాల అనే టైటిల్ ఫిక్స్ చేసి యువత నచ్చేలా ఆ వాస్తవ కథకు తెరరూపమిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మరోవైపు ప్రమోషన్స్‌పై ఫోకస్ పెట్టారు మేకర్స్.

బ్లాక్ ఆంట్ పిక్చర్స్ బ్యానర్‌పై అన్ని హంగులు జోడించి రూపొందించిన ఈ సినిమాకు భువన్ రెడ్డి కొవ్వూరి నిర్మాతగా వ్యవహరించారు. శరవణ వాసుదేవన్ సంగీతం సమకూర్చారు. నిఖిల్ సురేంద్రన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. వంశి ఉదయగిరి కో- డైరెక్టర్‌గా పని చేశారు. అన్ని వర్గాల ఆడియన్స్‌ని అలరించేలా ఈ సినిమా రూపొందించామని, ఈ సినిమాతో ప్రేక్షకులకు ఓ కొత్త ఫీల్ దొరుకుతుందని దర్శకనిర్మాతలు తెలిపారు.  

ఇంటర్మీడియట్ టీనేజ్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాల చిత్రంలో ప్రణవ్ సింగంపల్లి, షాజ్ఞ శ్రీ వేణున్, రామ్ పటాస్, తేజ గౌడ్, బాంబే పద్మ, శ్రీమునిచంద్ర, మండపేట మల్లిక జాగుల ముఖ్యపాత్రల్లో నటించారు. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు కానుకగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్.

నటీనటులు: ప్రణవ్ సింగంపల్లి, షాజ్ఞ శ్రీ వేణున్, రామ్ పటాస్, తేజ గౌడ్, బాంబే పద్మ, శ్రీమునిచంద్ర, మండపేట మల్లిక జాగుల

సాంకేతిక వర్గం: బ్యానర్: బ్లాక్ ఆంట్ పిక్చర్స్, కథ, దర్శకత్వం: శ్రీనాథ్ పులకురం, నిర్మాత: భువన్ రెడ్డి కొవ్వూరి, సంగీతం: శరవణ వాసుదేవన్, డి.ఒ.పి : నిఖిల్ సురేంద్రన్, కో- డైరెక్టర్: వంశి ఉదయగిరి, పీఆర్ఓ: సాయి సతీష్, పర్వతనేని రాంబాబు.

Prabhuthva Junior Kalasala Title Look Release:

Prabhuthva Junior Kalasala Title Look Release

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ