Advertisementt

స‌మాజాన్ని ప్ర‌శ్నించే స‌న్ ఆఫ్ ఇండియా

Wed 16th Feb 2022 07:52 PM
son of india director diamond ratnababu interview,manchu mohanbabu latest film son of india arriving on february 18th  స‌మాజాన్ని ప్ర‌శ్నించే స‌న్ ఆఫ్ ఇండియా
Director Diamond Ratnababu About Son Of India స‌మాజాన్ని ప్ర‌శ్నించే స‌న్ ఆఫ్ ఇండియా
Advertisement
Ads by CJ

సీనియర్ నటుడు మోహన్ బాబు హీరోగా తెరకెక్కిన సినిమా సన్ ఆఫ్ ఇండియా. దేశ భక్తి నేపథ్యంలో చాలా గ్రాండ్‌గా రూపొందిన ఈ సినిమాను ఫిబ్రవరి 18న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాను శ్రీ ల‌క్ష్మీప్ర‌స‌న్న పిక్చ‌ర్స్‌, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా నిర్మించాయి. ద‌ర్శ‌క‌త్వం వహించిన డైమండ్ ర‌త్న‌బాబు మీడియాతో ఈ చిత్రం విశేషాల‌ను పంచుకున్నారు.

ఈ సినిమా ప్ర‌త్యేక‌త ఏమిటంటే నాలుగు ఫైట్లు, ఐదు సాంగ్స్ అంటూ ఒక క‌మ‌ర్షియ‌ల్ ప్యాకేజ్ రూపంలో వెళ్ళ‌కుండా ఓ ప్ర‌యోగాత్మ‌క‌మైన చిత్రం చేశాను. ఎందుకు ప్ర‌యోగం చేశారు అని మీరు అడ‌గ‌వ‌చ్చు సాధార‌ణంగా క‌రోనా స‌మ‌యంలో అంద‌రూ ఎక్కువ‌గా రైతుల‌ను పొగిడారు. క‌రోనా స‌మ‌యంలో మ‌నంద‌రం ఇంకా బ్ర‌తికి ఉన్నాం అంటే దానికి కార‌ణం రైత‌న్న‌లే. అలాగే క‌రోనా స‌మ‌యంలో వైధ్యుల‌ను పొగిడారు మ‌నం బ్ర‌తికి ఉండ‌డానికి కార‌ణం వైధ్యులే అన్నారు. కానీ మ‌న సినిమా వాళ్ళు కూడా చాలా గొప్ప‌వారు. ఎందుకంటే క‌రోనా స‌మ‌యంలో లాక్‌డౌన్ పెట్టేసి ప్ర‌తి ఒక్క‌రిని ఇంట్లో పెట్టారు. ఇంట్లో పెట్టిన‌ప్పుడు సినిమా వాళ్ళ వ‌ల్ల యూట్యూబ్‌లో కానీ, ఓటీటీలోగానీ, ఎంట‌ర్‌టైన్ అవుతూ వారు లైఫ్‌ని లీడ్ చేశారు. క‌రోనా స‌మ‌యంలో డాక్ట‌ర్ల‌తో పాటు సినిమా వాళ్ళు కూడా గొప్ప‌వార‌ని నాకు అనిపించింది. కాబ‌ట్టి క‌రోనా స‌మ‌యంలో నేను మోహ‌న్‌బాబుగారిని క‌ల‌వ‌డం, సార్ ఒక చిన్న ప్ర‌యోగం చేద్దాం అని అడ‌గ‌డం జ‌రిగింది.

స‌న్ ఆఫ్ ఇండియా ఓటీటీ కోస‌మ‌ని ప్లాన్ చేసి ఒన్ అండ్ ఆఫ్ అవ‌ర్ ప్లాన్ చేశాం. కానీ సినిమా వ‌చ్చిన త‌ర్వాత థియేట‌ర్ల‌ను ప్రేమించే వ్య‌క్తిగా మోహ‌న్‌బాబుగారు నాకు థియేట‌ర్లంటే ఇష్టం ఓటీటీ మ‌ధ్య రిలీజ్ చెయ్య‌డం ఎందుకో అంత‌గా నాకు న‌చ్చ‌దు అన్నారు. ఇందులో అద్భుత‌మైన డైలాగులు ఉన్నాయి. ఈ సినిమా ఎలాగైనా థియేట‌ర్లో రావాల‌ని అన్నారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో పుణ్య‌భూమి నాదేశం, రాయ‌ల‌సీమ‌ రామ‌న్న‌ చౌద‌రి లాంటి ప‌వ‌ర్‌ఫుల్ డైలాగులు ఈ సినిమాలో ఉంటాయి. మోహ‌న్‌బాబు పాత్ర‌కి చిరంజీవిగారు వాయిస్ ఓవ‌ర్ ఇవ్వ‌డం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఇళ‌య‌రాజా లాంటి గొప్ప లెజండరీ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఈ సినిమాకి ప‌ని చేయ‌డం నాకు సంతోషంగా ఉంది. ఈ సినిమా నిడివి కేవ‌లం ఒక గంట 30 నిమిషాలు మాత్ర‌మే. ఇదొక స‌రికొత్త ప్ర‌యోగం. 

ప్రైవేట్ ఆసుప‌త్రులు, ప్రైవేట్ స్కూళ్ళ త‌ర‌హాలో ఈ చిత్రంలోని హీరో ప్రైవేట్ జైలుని న‌డ‌ప‌డం విశేషం. ట్రైల‌ర్లో ఆల్రెడీ మీరు చూసే ఉంటారు.. క్లీన‌ర్లు రేప్ చేస్తే ఎన్‌కౌంట‌ర్ చేస్తారు. మ‌రి రాజ‌కీయ‌నాయ‌కులు చేస్తే కేసులు ఉండ‌వా వంటి డైలాగులు ఈ చిత్రంలో చాలానే ఉంటాయి. ఎటువంటి వివాదం వ‌చ్చినా మోహ‌న‌బాబుగారు చూసుకుంటార‌నే ధ్యైర్యం నాకు ఉంది. అలాగే ఈ చిత్రంలో ర‌ఘువీర గ‌ద్యం హైలెట్ కానుంది. ఈ చిత్రంలో మోహ‌న్‌బాబు పాత్ర పేరు విరుపాక్ష‌. న్యాయ వ్య‌వ‌స్థ‌లో ఉన్న లొసుగులు గురించి ప్ర‌శ్నించే విధంగా విరూపాక్ష పాత్ర ఉంటుంది. త్వ‌ర‌లో మోహ‌న్‌బాబు, మంచుల‌క్ష్మీ క‌లిసి న‌టించే ఓ క్రైమ్ థ్రిల్ల‌ర్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాను అంటూ ముగించారు.

Director Diamond Ratnababu About Son Of India:

Mohan Babu Son Of India Film Releasing On February !8th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ