కమల్ హాసన్ - లోకేష్ కనకరాజ్ కలయికలో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ కీలక పాత్రల్లో నటిస్తున్న విక్రమ్ షూటింగ్ రీసెంట్ గా ముగించారు. కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన విక్రమ్ ఫస్ట్ గ్లాన్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి మెయిన్ విలన్ గా నటించారు. ఈ సినిమాలో ఫహద్ ఫాసిల్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు.
అయితే విక్రమ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. వేసవిలో ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. విడుదల తేదీ ఎప్పుడనేది మార్చి 14వ తేదీ ఉదయం 7 గంటలకు ప్రకటిస్తామని చిత్రబృందం ప్రకటించింది.