Advertisementt

అప్పుడే ముగించేసిన గాడ్ ఫాదర్

Mon 21st Mar 2022 07:14 PM
godfather,salman khan,chiranjeevi,super good films,surekha konidela,mohan raja,nayantara  అప్పుడే ముగించేసిన గాడ్ ఫాదర్
Salman threatens to walk out of Godfather అప్పుడే ముగించేసిన గాడ్ ఫాదర్
Advertisement
Ads by CJ

మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రంగా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ మూవీని  కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం ప్రస్తుతం ముంబై లో చిత్రీకరణ జరుపుకుంటుంది. గాడ్ ఫాదర్ లో బాడీ గార్డ్ గా నటించబోతున్న స‌ల్మాన్ ఈ మధ్యనే షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. మీ నటన ప్రేక్షకులకు అద్భుత కిక్‌ని ఇస్తుందనడంలో సందేహం లేదు.. అంటూ చిరంజీవి ఈ సంద‌ర్భంగా ట్వీట్ కూడా చేసారు. ఈ సిఎంమాలో స‌ల్మాన్ ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌ను పోషిస్తున్నారు. చిరంజీవి, స‌ల్మాన్ ఖాన్‌పై తెర‌కెక్కిస్తున్న స‌న్నివేశాలు చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయ‌ని చిత్ర‌యూనిట్ చెబుతోంది.. ఇలా మెగాస్టార్ చిరంజీవి, స‌ల్మాన్ ఖాన్‌లు ఇద్ద‌రూ ఒకేచోట కనిపించ‌డం అభిమానుల‌కు పండుగే. 

సల్మాన్ ఖాన్ - చిరు కాంబో లో ముంబై లోని ఓ స్టూడియో లో చిత్రీకరించారు. ప్రస్తుతం సోమ‌వారంతో గాడ్ ఫాదర్ ముంబై షెడ్యూల్ పూర్త‌యింది. ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత‌లు RB చౌదరి & NV ప్రసాద్ ముంబై సెట్లో మ‌ర్యాద‌పూర్వ‌కంగా చిరంజీవి, స‌ల్మాన్ ఖాన్‌ని క‌లిశారు. ఇందులో ద‌ర్శ‌కుడు మోహన్ రాజా కూడా వున్నారు. ఈ ఫొటోను చిత్ర యూనిట్ ఈరోజు విడుద‌ల చేసింది. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో నయనతార కీలక పాత్ర పోషిస్తోంది.

Salman threatens to walk out of Godfather:

Godfather: When Salman threatened to walkout

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ