Advertisementt

జూన్ 10న రెచ్చిపోదాం బ్రదర్

Fri 15th Apr 2022 02:55 PM
rechchipodam brother,rechchipodam brother movie,rechchipodam brother movie release on june 10th  జూన్ 10న రెచ్చిపోదాం బ్రదర్
Rechchipodam Brother Movie release on June 10th జూన్ 10న రెచ్చిపోదాం బ్రదర్
Advertisement
Ads by CJ

ప్రచోదయ ఫిలిమ్స్ పతాకంపై రవికిరణ్. వి, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రలలో ఏ.కె. జంపన్న దర్శకత్వంలో వి.వి లక్ష్మీ, హనీష్ బాబు ఉయ్యూరులు సంయుక్తంగా నిర్మించిన యాక్షన్ ఎంటర్ టైనర్ రెచ్చిపోదాం బ్రదర్. ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. జూన్ 10న ఈ సినిమా విడుద‌ల కాబోతోంది.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు జంపన్న మాట్లాడుతూ.. మంచి ఎమోషన్స్‌తో కూడుకున్న వైవిధ్యభరితమైన కథ ఇది. మా కథకు తగ్గ ఆర్టిస్టులు కుదిరారు. సంగీతానికి మంచి స్కోప్ ఉన్న చిత్రమిది. సాయి కార్తీక్ సంగీతం, శ్యాం.కె. నాయుడు కెమెరా అందాలు మా చిత్రానికి ప్రధాన ఆకర్షణ, ఈ చిత్రం అన్ని త‌ర‌హా ప్రేక్ష‌కుల‌కు బాగా న‌చ్చుతుంది అని అన్నారు.

చిత్ర హీరో రవికిరణ్ మాట్లాడుతూ.. నేటి వాస్తవిక పరిస్థితులకు అద్దం పట్టే చిత్రమిది. నాతో పాటు అతుల్ కులకర్ణి, పోసాని, భాను చందర్, ఇంద్రజ వంటి సీనియర్ ఆర్టిస్టులు ఎందరో నటించారు. ఈ చిత్రంలో పాటలు చాలా ట్రెండీగా, కొత్తగా ఉంటాయి. మా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విధానం చాలా స్టైలిష్‌గా ఉంటుంది. ప్రేక్షకులను మా చిత్రం మెప్పిస్తుందని ఆశిస్తున్నా.. అన్నారు.

చిత్ర నిర్మాత హనీష్‌బాబు మాట్లాడుతూ.. సినిమా చాలా బాగా వ‌చ్చింది. జూన్ 10న విడుద‌ల చేయ‌బోతున్నాం. నేటి యువత‌ను ఆలోచింపజేస్తూనే, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ఎంటర్‌టైన్‌మెంట్‌తో మా చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. విడుద‌ల త‌ర్వాత మా సినిమాకు భారీ రెస్పాన్స్ రావ‌డం ఖాయం అన్నారు.

Rechchipodam Brother Movie release on June 10th:

Rechchipodam Brother Movie release on June 10th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ