Advertisementt

రవితేజ టైగర్ కోసం 7కోట్ల తో భారీ సెట్‌

Sat 16th Apr 2022 05:30 PM
ravi teja,vamsee,abhishek agarwal,pan indian,tiger nageswara rao  రవితేజ టైగర్ కోసం 7కోట్ల తో భారీ సెట్‌
A Massive Set Worth 7 Cr Depicting Stuartpuram Village In 70s Erected In 5 Acres Land రవితేజ టైగర్ కోసం 7కోట్ల తో భారీ సెట్‌
Advertisement
Ads by CJ

రవితేజ వరస ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతున్నాడు. అంతేకాకుండా కెరీర్ లోనే తొలి పాన్ ఇండియా చిత్రంగా టైగర్ నాగేశ్వరరావు చేస్తున్నాడు. టైగర్ నాగేశ్వరరావు ఇంకా షూటింగ్ మొదలుపెట్టకుండానే అందరిలోనూ ఆసక్తిని పెంచుతుంది. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకను గ్రాండ్ గా నిర్వహించగా, టైటిల్‌తో పాటు ప్రీ-లుక్ పోస్టర్లు చాలా క్యూరియాసిటీని పెంచాయి. 

మహానటి, జెర్సీ, ఎవరు, శ్యామ్ సింగరాయ్ లాంటి సూపర్‌హిట్ చిత్రాలకు పనిచేసిన అవినాష్ కొల్లా ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. ఆయన పర్యవేక్షణలో 7 కోట్ల రూపాయిల ఖర్చుతో 70వ దశకంలో నాటి స్టూవర్టుపురంను చిత్రీకరీంచడానికి ఓ భారీ సెట్‌ ని నిర్మిస్తున్నారు. శంషాబాద్ సమీపంలో 5 ఎకరాల్లో ఈ సెట్‌ను నిర్మిస్తున్నారు. రవితేజ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రమిది.

స్టువర్ట్‌పురం రాబిన్ హుడ్ గా పేరుపొందిన టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ గా 70 వ దశకం నాటి స్టువర్ట్‌పురం నేపధ్యంలో ఈ సినిమా ఉండబోతుంది. టైగర్ నాగేశ్వరరావు కోసం రవితేజ సరికొత్తగా మేకోవర్ అయ్యారు. మునుపెన్నడూ లేని విధంగా రవితేజ బాడీ లాంగ్వేజ్, డిక్షన్, గెటప్ పూర్తి భిన్నంగా ఉండబోతున్నాయి. ఈ సినిమాలో రవితేజ సరసన నూపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా కనిపించబోతున్నారు.

A Massive Set Worth 7 Cr Depicting Stuartpuram Village In 70s Erected In 5 Acres Land:

A Massive Set Worth 7 Cr Depicting Stuartpuram Village In 70s Erected In 5 Acres Land For Ravi Teja, Vamsee, Abhishek Agarwal Arts Pan Indian Film Tiger Nageswara Rao

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ