Advertisementt

ప్ర‌ముఖ నిర్మాత నారాయ‌ణ దాస్ నారంగ్ మృతి

Tue 19th Apr 2022 11:20 AM
producer narayana das narang,producer narayana das narang has passed away  ప్ర‌ముఖ నిర్మాత నారాయ‌ణ దాస్ నారంగ్ మృతి
Producer Narayana Das Narang passed away ప్ర‌ముఖ నిర్మాత నారాయ‌ణ దాస్ నారంగ్ మృతి
Advertisement
Ads by CJ

ప్ర‌ముఖ నిర్మాత‌, చ‌ల‌నచిత్ర వాణిజ్య‌మండ‌లి అధ్య‌క్షుడు నారాయ‌ణ దాస్ నారంగ్ (76) క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో వున్న ఆయ‌న స్టార్ ఆసుప్ర‌తిలోచికిత్స తీసుకుంటున్నారు. ఆయ‌న చికిత్స పొందుతూ మంగ‌ళ‌వారంనాడు ఉద‌యం 9.04 నిముషాల‌కు (ఏప్రిల్ 19,2022)న తుదిశ్వాస విడిచారు. ఆయ‌న‌కు ఇద్ద‌రు కుమారులు, ఒక కుమార్తె వున్నారు. ఆయ‌న కుమారులు సునీల్ నారంగ్‌, భ‌ర‌త్ నారంగ్ కూడా నిర్మాత‌లే. 

నారాయ‌ణ దాస్ నారంగ్ 1946 జులై 27న జ‌న్మించారు. ఆయ‌న డిస్ట్రిబూట‌ర్‌గా ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను విడుద‌ల చేశారు. నిర్మాత‌గా మంచిపేరు సంపాదించుకున్నారు. ఏషియ‌ర్ గ్రూప్ అధినేత గ్లోబ‌ల్ సినిమా స్థాప‌కుడు, ఫైనాన్సియ‌ర్‌కూడా ఆయిన ఆయ‌న చ‌ల‌న‌చిత్రరంగంలో అజాత‌శ‌త్రువుగా పేరుగాంచారు. తెలంగాణ‌లో పంపిణీదారునిగా ఆయ‌న మంచి పేరు ప్ర‌ఖ్యాతులు పొందారు. ఆయ‌న మృతి ప‌ట్ల తెలుగు చ‌ల‌న‌చిత్ర వాణిజ్య‌మండ‌లి, తెలంగాణ వాణిజ్య‌మండ‌లి త‌మ ప్ర‌గాఢ‌సానుభూతి తెలియ‌జేసింది.

నారాయణ దాస్ నారంగ్ భౌతికాయాన్ని ఆస్పత్రి నుంచి మరో గంటలో వారి ఇంటికి తీసుకురానున్నారు. ఈరోజు సాయంత్రం 4గంట‌ల‌కు జూబ్లీహిల్స్‌లోని మ‌హాప్ర‌స్తానంలో అంత్య‌క్రియ‌లు జ‌ర‌గ‌నున్నాయ‌ని కుటుంబ‌స‌భ్యులు తెలియ‌జేశారు.

Producer Narayana Das Narang passed away:

Narayana Das Narang passed away

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ