సర్కారు వారి పాటకు పనిచేసిన స్టార్ ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ మీడియాతో ముచ్చటించారు.
డైరెక్టర్ పరశురాం గారు ఈ కథ చెప్పాక మీ మొదటి ఫీలింగ్ ఏంటి ?
పరశురాం గారు మొదట కథ చెప్పినపుడు ఇది పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అనిపించింది. చాలా పెద్ద యాక్షన్, ఎంటర్ టైనర్ అవుతుందని డైరెక్టర్ గారికి అప్పుడే చెప్పా. తర్వాత పని చేయడం మొదలుపెట్టా.
మహేష్ బాబు గారితో వర్క్ ఎక్స్ పీరియన్స్ ఎలా వుంటుంది ?
మహేష్ బాబు గారితో ఇది7 వ సినిమా. సెట్స్ లో చాలా సరదాగా వుంటారు. అదే సమయంలో టెక్నిషియన్ నుంచి అవుట్ పుట్ కూడా అద్భుతంగా రాబట్టుకుంటారు. సాంగ్స్, యాక్షన్ సీక్వెన్స్ కి సంబధించిన అన్నీ విషయాలని చర్చిస్తారు. ఈ సినిమాలో మహేష్ బాబు గారు నెక్స్ట్ లెవెల్ లో కనిపిస్తారు. ఆయన సెట్ లో డ్యాన్స్ చేస్తుంటే విజువల్ ట్రీట్ లా వుంటుంది.
సర్కారు వారి పాట కోసం పెద్ద బ్యాంక్ సెట్ వేశారట కదా.. బ్యాంక్ సెట్ విశేషాలేంటీ ?
సర్కారు వారి పాట స్టొరీ పాయింట్ బ్యాంక్ నేపధ్యంలో వుంటుంది. దీని కోసం మూడు బ్యాంకులు అవసరమయ్యాయి. అందులో ఒకటి యాబై ఏళ్ళ క్రితం బ్యాంకు ఎలా వుంటుంది ? అనే దానిపై స్టడీ చేసి, వింటేజ్ లుక్ లో డిజైన్ చేసి, అన్నపూర్ణ స్టూడియో లో సెట్ వేశాం. ఇది ఫ్లాష్ బ్యాక్ లో వస్తుంది. అలాగే మరో రెండు మోడరన్ బ్యాంక్ సెట్స్ వేశాం.
సర్కారు వారి పాట టైటిల్ జస్టిఫికేషన్ ఇవ్వగలరా ?
కథలోనే వుంది. సినిమా బిగినింగ్ లోనే మీకు అర్ధమైపోతుంది
బ్యాంకు కాకుండా మరేమైన సెట్స్ వేశారా ?
భారీ సినిమా ఇది. ఆర్ట్ వైజ్ చాలా రోజులు పని చేశాం. బ్యాంకు కాకుండా దాదాపు ఎనిమిది సెట్స్ వేశాం. అలాగే ఒక వీధి సెట్ కూడా వుంది. మొదట గోవాలో చేద్దామని అనుకున్నాం. అయితే కొన్ని ప్రాక్టికల్ సమస్యలు వచ్చాయి. మళ్ళీ హైదరాబద్ లోనే ఒక బేసిక్ కాలనీ తీసుకుని దాన్ని వైజాగ్ వీధిలా కథకు తగ్గట్టు డిజైన్ చేశాం. ఇలా ఒకటి కాదు.. చాలా వరకూ సెట్స్ లోనే షూటింగ్ జరిగింది. చాలా ఇంటీరియర్, ఎక్స్ టీరియర్ డిజైన్ చేశాం..
మహేష్ బాబు గారి ఏడు సినిమాలు చేశారు. ఇందులో ది బెస్ట్ ఆర్ట్ వర్క్ ఏమిటి ? అలాగే కష్టమైనది ఏంటి ?
కష్టం అనేది లేదు. ప్రతి సినిమాకి ఒకేలా వర్క్ చేస్తాం. కొన్నిటికి మంచి పేరు రావచ్చు. పెద్ద సెట్స్ వుంటే అవార్డ్స్ వస్తాయి. సర్కారు వారి పాట కోసం చాలా వర్క్ చేశాం. ఇంటీరియర్, ఎక్స్ టీరియర్ ఇలా చాలా డిజైన్ చేశాం. సినిమా చూశాక అసలు ఇది సెట్టా ? అని కనిపెట్టలేరు. అంత నేచురల్ గా వుంటాయి.
దూకుడు చిత్రానికి ఈ సినిమాకు ఆర్ట్ విషయంలో ఎలాంటి తేడా గమనించారు ?
అప్పట్లో దూకుడు పెద్ద సినిమా. తర్వాతర్వాత బడ్జెట్ పెరగడంతో పాటు మెటీరియల్, లేబర్ ఖర్చులు కూడా పెరిగాయి. అయితే కథ ప్రకారం ఎంత బడ్జెట్ పెరిగినా నిర్మాతలు రాజీపడకుండా కావాల్సినవి సమకూరుస్తుంటారు.
మీ సినిమాలు కాకుండా ఆర్ట్ విభాగంలో లో మీకు బాగా నచ్చిన సినిమా ?
బాహుబలి అనే చెప్తాను. ఆ సినిమా స్కేల్ అలాంటింది.
కొత్తగా చేస్తున్న సినిమాలు ?
చిరంజీవి గారి భోళాశంకర్, చిరంజీవి - డైరెక్టర్ బాబీ, బాలకష్ణ- మలినేని గోపీచంద్ సినిమా, త్రివిక్రమ్-మహేష్ బాబు, వెంకటేష్ - వరుణ్ తేజ్ - అనిల్ రావిపూడి F3 సినిమాలకి చేస్తున్నా.