Advertisementt

సుధీర్ బాబు మామా మశ్చీంద్ర ఫస్ట్ లుక్

Wed 11th May 2022 01:32 PM
nitro star,sudheer babu,harshavardhan,sree venkateswara cinemas,mama mascheendra first look  సుధీర్ బాబు మామా మశ్చీంద్ర ఫస్ట్ లుక్
Mama Mascheendra First Look Out సుధీర్ బాబు మామా మశ్చీంద్ర ఫస్ట్ లుక్
Advertisement
Ads by CJ

నైట్రో స్టార్ సుధీర్ బాబు కథానాయకుడిగా హర్షవర్ధన్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ ఎల్‌ పి ప్రొడక్షన్ నెం 5గా నారాయణదాస్ కె నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్న చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. సోనాలి నారంగ్, సృష్టి సెల్యులాయిడ్ సమర్పిస్తున్న ఈ చిత్రం.. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోంది. సుధీర్ బాబు పుట్టినరోజును పురస్కరించుకుని మేకర్స్ ఈరోజు సినిమా టైటిల్,  ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇదే సందర్భంలో తన టాప్ క్లాస్ పెర్ఫార్మెన్స్, డైనమిక్ స్క్రీన్ ప్రెజెన్స్ తో తెలుగు ప్రేక్షకులనే కాకుండా బాలీవుడ్ ని సైతం ఆకట్టుకున్న సుధీర్ బాబుకు నైట్రో స్టార్ ట్యాగ్ ఇవ్వబడింది. 

ఈ చిత్రానికి మామా మశ్చీంద్ర అనే ఆసక్తికరమైన టైటిల్ పెట్టారు. మశ్చీంద్ర అనే పదానికి .. పవర్ ని కోరుకునేవాడు, ధైర్యవంతుడనే అర్ధాలు వున్నాయి. ఈ టైటిల్ సినిమాలో నైట్రో స్టార్ సుధీర్ బాబు పాత్రని ప్రతిబింబిస్తుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఒక రాక్ స్టార్ లా ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నారు నైట్రో స్టార్ సుధీర్ బాబు. ఈ సినిమాలో సుధీర్ బాబు ఛాలెంజింగ్ రోల్ పోషిస్తున్నారు. దర్శకుడు హర్షవర్ధన్ మునుపెన్నడూ చూడని మల్టీ షేడ్ క్యారెక్టర్‌లో సుధీర్ బాబుని చూపించబోతున్నారు. వినూత్నమైన కాన్సెప్ట్‌తో యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా రూపొందించబడుతున్న ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు కీలక పాత్రలలో కనిపిస్తుండగా, అత్యున్నత టెక్నికల్ టీం పని చేస్తోంది.

Mama Mascheendra First Look Out:

Nitro Star Sudheer Babu, Harshavardhan, Sree Venkateswara Cinemas Mama Mascheendra First Look Out

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ