Advertisementt

లెహ‌రాయి మొద‌టి సింగిల్

Thu 12th May 2022 10:08 AM
lehrayi movie,lehrayi movie first single,karthikeya launches lehrayi movie first single  లెహ‌రాయి మొద‌టి సింగిల్
Lehrayi movie first single లెహ‌రాయి మొద‌టి సింగిల్
Advertisement
Ads by CJ

స‌క్స‌స్ ఫుల్ నిర్మాత బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ ఎల్ ఎస్ మూవీస్ పతాకంపై రంజిత్, సౌమ్య మీనన్ జంట‌గా , ఇటీవ‌లే ధ‌ర్మ‌పురి చిత్రం తో హీరోగా ప‌రిచయం అయ్యిన గగన్ విహారి,రావు రమేష్, సీనియర్ నరేష్,అలీ నటీనటులుగా  రామకృష్ణ పరమహంస ద‌ర్శ‌కుడి గా ప‌రిచ‌యం చేస్తూ మద్దిరెడ్డి శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రం "లెహరాయి". ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జ‌రుపుకుంటుంది. నువ్వు ఏడికొస్తే ఆడికెల్తా సువ‌ర్ణ నీ ఇంటి పేరు మారుస్తా సువ‌ర్ణ అంటూ 90 స్ లో వ‌చ్చిన సాంగ్ ఇప్ప‌టికి వినిపిస్తుందంటే ఆ సాంగ్ ప్రేక్ష‌కుల్ని అల‌రించిన విధానం అలాంటిది. ఇదొక్క‌టే కాదు సినిమాతో సంభందం లేకుండా ఆడియో సూప‌ర్‌హిట్ చేయ్య‌ట‌మే కాకుండా అంద‌రూ పాడకునేలా సంగీతాన్ని అందించిన ఘంటాడి కృష్ణ ఈ చిత్రం తో జికే ఈజ్ బ్యాక్ అన్న‌ట్టు లెహ‌రాయి చిత్రం లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసారు. ఈచిత్రం లో 7 పాట‌ల్ని ఇప్ప‌టి జెన‌రేష‌న్ కి ఏమాత్రం త‌గ్గ‌కుండా కంపోజ్ చేశారు. జి కే అందించిన ఆడియోలో గ‌త వారం మొద‌టి సింగిల్ ప్రోమొ రిలీజ్ చేస్తే చాలా మంచి రెస్సాన్స్ వ‌చ్చింది. ఇప్పుడు లిరిక‌ల్ ఫుల్ సాంగ్ ని త‌క్కువ టైం లోనే యూత్ తో క్రేజ్ సంపాయిచుకున్న ట్రెండ్ సెట్టింగ్ హీరో కార్తికేయ  చేతుల మీదుగా సాంగ్ ని లాంచ్ చేశారు.

కార్తికేయ మాట్లాడుతూ.. ఈ చిత్రం లో మొద‌టి సాంగ్ చూసాను, క్యాచి లిరిక్స్ తో హ‌మ్మింగ్ ట్యూన్ తో చాలా బాగుంది. ద‌ర్శ‌కుడు రామ‌కృష్ణ ప‌ర‌మ‌హంస కి, మ్యూజిక్‌ ద‌ర్శ‌క‌డు జికే కి , రామ‌జోగ‌య్య శాస్ట్రి గారికి నిర్మాత శ్రీనివాస్ గారికి, న‌టీన‌టుల‌కి మ‌రియు నిర్మాత బెక్కం వేణుగోపాల్ గారికి నా ప్ర‌త్యేఖ‌మైన అభినంద‌న‌లు. ఈ సాంగ్ మంచి విజ‌యాన్నిసాధించాల‌ని కొరుకుంటున్నాను.

ఈ సంద‌ర్బంగా నిర్మాత మ‌ద్దిరెడ్డి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ.. స‌క్సస్ లో వున్న మంచి ప్రోడ్యూస‌ర్ బెక్కం వెణుగొపాల్ గారు స‌మ‌ర్ప‌ణ‌లో మా లెహ‌రాయి చిత్రం టైటిల్ ఎనౌన్స్ చేసాము. చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్పుడు మా మొద‌టి సాంగ్ ని యంగ్ హీరో కార్తికేయ చేతుల మీదుగా లాంచ్ చేయ‌డం చాలా ఆనందం గా వుంది. ఈ సాంగ్ ని జికే గారు ఆయ‌న సాంగ్స్ కి ఏమాత్ర త‌గ్గ‌కుండా కంపోజ్ చేశారు, జావేద్ ఆలి పాడ‌గా, స‌రస్వ‌తి పుత్రుడు రామ‌జోగ‌య్ శాస్ట్రి గారు త‌న క‌లాన్ని అందించారు. అద్బుత‌మైన ట్యూన్ కి చ‌క్క‌టి లిరిక్స్ తో ఈ సాంగ్ యూత్ ని అల‌రిస్తుంది. అన్నారు

ద‌ర్శ‌కుడు రామ‌కృష్ణ ప‌ర‌మ‌హంస మాట్లాడుతూ.. గుప్పెడంత గుండెల్లోన వుంటావే..దాని చ‌ప్పుడేమొ విన‌నంటావే అనే యూత్ ఫుల్ సాంగ్ ని ఈ రోజు కార్తికేయ గారి చేతుల మీదగా లాంచ్ చేశాము. ఈ సాంగ్ అంద‌ర్ని ఆక‌ట్ట‌కుంటుంది. జికే  గారు మ్యూజిక్ మ‌ల్లి మ్యాజిక్ ని రిపీట్ చేస్తుంది. ఈ చిత్రం లో మొత్తం 7 సాంగ్స్ వున్నాయి. ప్ర‌తిసాంగ్ అల‌రించే విధంగా వుంటుంది. మంచి ఫీల్ వున్న క‌థ లో చిత్రాన్ని తెర‌కెక్కించాను. త్వ‌ర‌లో రిలీజ్ డేట్ ని ఎనౌన్స్ చేస్తాము. ప్ర‌ముఖులు న‌టించిన ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత బెక్కం వేణుగొపాల్ గారు స‌మ‌ర్పించ‌డం చాలా ఆనందం గా వుంది.. అన్నారు.

Lehrayi movie first single:

Karthikeya launches Lehrayi movie first single

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ