Advertisementt

పాన్‌ ఇండియా చిత్రం జ్వాల టీజర్‌ విడుదల

Fri 27th May 2022 08:02 PM
jwala,jwala teaser,jwala movie teaser,vijay antony,arun vijay,prakashraj,raimasen,nazar,director naveen,m rajasekhar reddy  పాన్‌ ఇండియా చిత్రం జ్వాల టీజర్‌ విడుదల
Pan India movie Jwala teaser released పాన్‌ ఇండియా చిత్రం జ్వాల టీజర్‌ విడుదల
Advertisement
Ads by CJ

విజయ్‌ఆంటోనీ, అరుణ్‌ విజయ్‌ పాన్‌ ఇండియా చిత్రం జ్వాల టీజర్‌ విడుదల, ఆర్‌ఆర్‌ఆర్, కె.జి.ఎఫ్, విక్రమ్‌ ల వరసలో జ్వాల.

పాత రోమ్‌ నగరం గుర్తుందా మిత్రుడా! ఇద్దరు గ్లాడియేటర్స్‌ తలపడతారు, ఓడినవాడు చస్తాడు గెలిచినవాడు మాత్రమే బ్రతుకుతాడు...బతికుంటే అలాంటి ఒక గెలుపుతో బతికుండాలి. చచ్చినాకూడా అలాంటి వాడి చేతిలో చచ్చాము అనే గర్వంతో చావాలి... ఇటువంటి పవర్‌ఫుల్‌ డైలాగ్‌లు ఉన్న జ్వాల చిత్ర టీజర్‌ను శుక్రవారం ప్రముఖ నటుడు ఆలిండియా యాక్టర్‌ రానా దగ్గుబాటి సోషల్‌ మీడియా ట్వీట్టర్‌ ద్వారా విడుదల చేశారు. ఈ మధ్యే విడుదలైన ఆర్‌ఆర్‌ఆర్‌, కె.జి.ఎఫ్‌–2, విక్రమ్‌ వంటి పాన్‌ఇండియా చిత్రాల సరసన చేరనుంది జ్వాల సినిమాకూడా. జ్వాల చిత్ర టీజర్‌కూడా ఇంచుమించు ఆ సినిమాల స్థాయిలోనే ఉంది. బేస్‌ వాయిస్‌తో తెరమీద కనిపించే సన్నివేశాలను గురించి విశ్లేషిస్తూ బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ మనిషి కథలా చెప్తూ ఉంటారు.

సాహో ఫేమ్‌ అరుణ్‌ విజయ్, బిచ్చగాడు ఫేమ్‌ విజయ్‌ ఆంటోని టీజర్‌లో పోటాపోటీగా నటించారు. అక్షరహాసన్‌ కీలక పాత్రలో నటించారు. జ్వాల పాన్‌ఇండియా చిత్రాన్ని అమ్మ క్రియేషన్స్‌ టి.శివ సమర్పిస్తుండగా శర్వాంత్‌రామ్‌ క్రియేషన్స్‌ పతాకంపై జవ్వాజి రామాంజనేయులు, షిరిడిసాయి మూవీస్‌ పతాకంపై యం.రాజశేఖర్‌ రెడ్డి నిర్మించారు. రష్యా, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, స్విట్జర్లాండ్, కలకత్తాలతో పాటు అనేక దేశాల్లో షూటింగ్‌ జరుపుకుంది. అరుణ్‌విజయ్, విజయ్‌ ఆంటోనీ, అక్షరహాసన్‌ల కెరీర్‌లోనే తెరకెక్కిన భారీబడ్జెట్‌ చిత్రం జ్వాల. ఈ చిత్రాన్ని నవీన్‌ దర్శకత్వం వహించారు. ప్రకాశ్‌రాజ్, రైమాసేన్,నాజర్‌ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కెమెరా– కె.ఎ.బచ్చ, ఎడిటర్‌– వెట్రికృష్ణన్, సంగీతం– నటరాజన్‌ శంకరన్‌, పీ.ఆర్‌.వో– శివమల్లాల.

Click Here: JwalaTeaser 

Pan India movie Jwala teaser released:

Vijay Antony, Arun Vijay Pan India movie Jwala teaser released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ