Advertisementt

నిరుపేద కళాకారులకు 101 ప్లాట్లు

Sun 05th Jun 2022 05:37 PM
v vijaya kumar,poor artists,talasani,ramanachary,vision vijay kumar,talasani srinivas,maganti gopinath  నిరుపేద కళాకారులకు 101 ప్లాట్లు
101 plots for poor artists నిరుపేద కళాకారులకు 101 ప్లాట్లు
Advertisement
Ads by CJ

టెలివిజన్ 24 క్రాఫ్ట్స్ లోని నిరుపేద కళాకారులకు 101 ప్లాట్లు ఇచ్చిన ధాత వి.విజయ్ కుమార్. 

దివంగత నేత అన్న నందమూరి తారక రామారావు లాంటి నటుడు, రాజకీయ నాయకుడు  తెలుగోడి ఆత్మ గౌరవం ఇలాంటి వ్యక్తి రాడు రాలేడు అన్నాడు మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్, విజన్ వివికే వి.విజయ్ కుమార్ గారు టెలివిజన్ లోని 24 క్రాఫ్ట్స్ లో వుండే వెనుకబడిన పేద కళాకారులకు 101 ఫ్లాట్స్ ను ఉచితంగా  అందిస్తున్న సందర్బంగా హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ ఆవరణలో ఈ కార్యక్రమం ఘనంగా జరుపుకుంది. సాంసృతిక కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సభకు ముఖ్య అతిధులు వచ్చిన సినిమాటోగ్రఫి మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే గోపీనాథ్, జ్యోతి ప్రజ్వలన చేశారు. ఇంకా వీరితో పాటు ప్రభుత్వ ముఖ్య సలహాదారు శ్రీ కె.వి. రమణాచారి, జాయింట్ లేబర్ కమీషనర్ గంగాధర్,బిసి కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణ మోహన్, నటులు జాకీ, హరిత, ధనలక్ష్మి, కల్పన, సుష్మ, సింగర్స్, మరియు సీరియల్ ఆర్టిస్టులు, సినిమా ఆర్టిస్టులు, తెలుగు టెలివిజన్ & డిజిటల్ మీడియా టెక్నీషియన్స్ మరియు వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు పాల్గొన్నారు. అనంతరం విజన్ వివికే వి. విజయ్ కుమార్ గారూ ఇచ్చిన మాట ప్రకారం 101 మంది నిరుపేద టీవీ కళాకారులకు ఉచితంగా ఇళ్ల స్థలాలు పత్రాలను శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు శ్రీ కె.వి.రమణాచారి గారి చేతుల మీదుగా అందజేశారు.

ఈ సందర్బంగా.విజన్ వివికే విజయ్ కుమార్ మాట్లాడుతూ.. నేను చేసే సేవ ఎవరికైతే మాటిచ్ఛా మో వారికి అందితే చాలు తీసుకున్న వారికి ఇచ్చిన వారికి తెలిస్తే చాలు బహిరంగంగా అక్కర్లేదు అని రమణాచారి గారితో చెపితే.. లేదు ఇలాంటి మంచి విషయం అందరికీ తెలవాలని నాగబాల సురేష్ గారు వారి సభ్యులు ఈ రోజు ఇంత గ్రాండ్ గా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన వారందరికీ ధన్యవాదములు తెలుపు కుంటున్నాను.ఈ కార్యక్రమానికి , మినిష్టర్ తలసాని,ఎమ్మెల్యే గోపినాథ్ తో పాటు పలువురు పెద్దలు రావడం చాలా సంతోషంగా ఉంది.గత సంవత్సరం టివి ఫెడరేషన్ ఆధ్వర్యంలో మూడు వేల మందితో ఒక నివేదన సభ జరిగితే అక్కడకు మినిస్టర్స్, ఎమ్మెల్యే లు, ఐ ఏ యస్, ఐ. పి. యస్ ఆఫీసర్స్ ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2014 లో ప్రగతి నగర్ లో ప్రారంభమైన మా సంస్థ  ఈ రోజు అంచె లంచెలుగా ఎదుగుతూ చాలా బ్రాంచ్ లను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మా కు వచ్చే ఆదాయంలో కొంత పేద కళాకారులకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను అన్నారు.

తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. విజయ్ కుమార్ గొప్ప నిర్ణయం తీసుకోవడమే కాకుండా టివి రంగానికి సంబందించిన పేద కళాకారులను  సహాయం చేసే మంచి నిర్ణయం తీసుకున్నాడు.టెలివిజన్ లోని 24 క్రాఫ్ట్స్ లలో వున్న ఒక్కొక్క క్రాఫ్ట్ నుండి ఐదు గురు కళాకారులను సెలెక్ట్ చేసుకొని 101 ఫ్లాట్స్ ఇవ్వడం గొప్ప విషయం. ఈ భూమి సుమారు 6 కోట్ల విలువ చేసే భూమిని ఇవ్వడం గొప్ప విషయం.పేదవాడి ఆశీర్వాదములు మనకు జీవితకాలం తోడుగా ఉంటాయి. విజయ్ కు వారి ఆశీర్వాదములు ఎల్లప్పుడూ ఉంటూ వారి బిజీనెస్ దినదినాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అలాగే ఈ రోజు ముఖ్యమంత్రి కె. సి.ఆర్ గారు పేద ప్రజలకు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు. అవన్నీ ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి. ఈ రోజు హైదరాబాద్ కు కరెంట్ కొరత, నీటి కొరత ఇలా అన్ని రకాలుగా హైదరాబాద్ అందరికీ సౌకర్య వంతంగా ఉంది.

ప్రభుత్వ సలహాదారుడు రమణా చారి మాట్లాడుతూ.. తన జన్మదిన సందర్బంగా 101 మందికి భూదానం చేస్తున్నటు వంటి విజయ్ గారికి ధన్యవాదములు. నేను గత 47ఏళ్లుగా ఎంతో మందిని చూశాను. కానీ మాట తప్పకుండా చేసే టటువంటి వ్యక్తులు అరుదుగా వుంటారు. ప్రతి రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా మంచి మనసుతో ఆలోచించి పేద కళాకారులకు సహాయం చూస్తే వారి అందరి జీవితాల్లో వెలుగును నింపిన వారవుతారు అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ఇది భారత దేశ టీవీ చరిత్రలో టీవీ కళాకారులకు మొట్టమొదటి భూదాన కార్యక్రమమిది. ఇది సువర్ణాక్షరాలతో లిఖించబడింది అని పలువురు పెద్దలు అభివర్ణించారు అన్నారు.

101 plots for poor artists:

TV Federation and Serial Artists Press Meet