Advertisementt

బాలకృష్ణ చేతుల మీదుగా చోర్ బజార్ ట్రైలర్

Thu 09th Jun 2022 03:06 PM
balakrishna,akash puri,jeevan reddy,vs raju,chor bazaar,chor bazaar fun-filled action trailer  బాలకృష్ణ చేతుల మీదుగా చోర్ బజార్ ట్రైలర్
Chor Bazaar Fun-filled Action Trailer Out Now బాలకృష్ణ చేతుల మీదుగా చోర్ బజార్ ట్రైలర్
Advertisement
Ads by CJ

టాప్ డైరెక్టర్ పూరి కొడుకు ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న సినిమా చోర్ బజార్. గెహన సిప్పీ హీరోయిన్ గా నటిస్తోంది. దళం, జార్జ్ రెడ్డి సినిమాలతో తన మార్కు క్రియేట్

చేసుకున్న జీవన్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా అతి త్వరలో థియేటర్ లలో విడుదలకు సిద్ధమవుతోంది. లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న చోర్ బజార్ సినిమా ట్రైలర్ ను ఇవాళ నట సింహం బాలకృష్ణ విడుదల చేశారు. తీరిక లేని షెడ్యూల్స్ లోనూ తమ సినిమా ట్రైలర్ విడుదల చేసిన బాలకృష్ణకు చిత్రబృందం థాంక్స్ తెలియజేశారు. ఈ సందర్భంగా 

బాలకృష్ణ మాట్లాడుతూ...చోర్ బజార్ ట్రైలర్ చాలా బాగుంది, టైటిల్ కూడా ఆకట్టుకునేలా ఉంది. పైసా వసూల్ సినిమా నుంచి పూరి జగన్నాథ్ కుటుంబంతో మంచి అనుబంధం ఏర్పడింది. ఆకాష్ పూరి ఈ సినిమాతో మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. చిత్ర బృందం అందరికీ శుభాకాంక్షలు. మన తెలుగు వారికి సినిమా కూడా నిత్యావసరమే. కరోనా సమయంలో థియేటర్లకు ప్రేక్షకులు రావడం తగ్గినా ఆ తర్వాత మళ్లీ మన సినిమాలు మంచి వసూళ్లు సాధిస్తున్నాయి. కొత్తగా, భిన్నంగా ఉన్న చిత్రాలకు అందరి ఆదరణ తప్పకుండా ఉంటుంది. చోర్ బజార్ కూడా అలాంటి కొత్త తరహా సినిమా అవుతుందని ఆశిస్తున్నాను. అన్నారు.

చోర్ బజార్ ట్రైలర్ లో హీరో ఆకాష్ పురి బచ్చన్ సాబ్ అనే క్యారెక్టర్ తో మాస్ బాడీ లాంగ్వేజ్ తో కనిపిస్తున్నారు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడికి ఒక దూల ఉంటుంది. నాకు చేతి దూల. 20 నిమిషాల్లో 30 టైర్స్ విప్పేస్తా నా దిల్ కా దఢకన్ కోసం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కొట్టాలి అంటూ ఆకాష్ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ ప్రేమకథకు డైమండ్ మిస్సింగ్ ఎలిమెంట్ పెట్టడం ద్వారా కంప్లీట్ కమర్షియాలిటీ తీసుకొచ్చారు దర్శకుడు జీవన్ రెడ్డి. 

Chor Bazaar Fun-filled Action Trailer Out Now:

Akash Puri, Jeevan Reddy, VS Raju Chor Bazaar Fun-filled Action Trailer Out Now

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ