ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లైగర్(సాలా క్రాస్‌బ్రీడ్) థియేట్రికల్ ట్రైలర్ జూలై 21న విడుదల కానుంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న ఈ భారీ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని సౌత్ తో పాటు నార్త్ లో కూడా నిర్వహించాలని నిర్మాతలు నిర్ణయించారు.
విజయ్ దేవరకొండ, కరణ్ జోహార్, ఛార్మి కౌర్, ఇతర టీమ్ సభ్యుల సమక్షంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గురించి చర్చిస్తున్న వీడియోని ఈ సందర్భంగా విడుదల చేశారు. ఛార్మి రెండు ఈవెంట్‌లను నిర్వహించాలనే ప్రతిపాదనను ఉంచగా, కరణ్ దానిని ఆమోదించగా, ట్రైలర్ తుఫాను సృష్టించబోతోందని విజయ్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ ఈవెంట్ ఆర్ టీ సి క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్‌లో ఉదయం 9:30 గంటలకు జరుగుతుంది. ముంబై ఈవెంట్ అంధేరిలోని సినీపోలిస్‌లో సాయంత్రం 7:30 గంటలకు జరుగుతుంది.
లైగర్ టీమ్ ఇప్పటికే టీజర్, పోస్టర్లు , ఫస్ట్ సింగిల్‌తో భారీ బజ్ ని క్రియేటర్ చేయగా, ట్రైలర్ దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ తుఫాన్ ని సృష్టించడానికి రెడీ అవుతుంది.
విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే కథానాయిక గా నటిస్తున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో
లెజెండ్ మైక్ టైసన్ ఇండియన్ స్క్రీన్‌పై అరంగేట్రం చేస్తున్నారు.