Advertisementt

శ‌ర‌ణు కోరితే ప్రాణ బిక్ష‌.. ఎదిరిస్తే మ‌ర‌ణం

Wed 27th Jul 2022 08:38 PM
bimbisara,ntr,kalyan ram,bimbisara trailer  శ‌ర‌ణు కోరితే ప్రాణ బిక్ష‌.. ఎదిరిస్తే మ‌ర‌ణం
Bimbisara Trailer released శ‌ర‌ణు కోరితే ప్రాణ బిక్ష‌.. ఎదిరిస్తే మ‌ర‌ణం
Advertisement
Ads by CJ

ప్రేక్ష‌కుల హృద‌యాల్లో త‌న‌దైన స్థానాన్ని సంపాదించుకున్న హీరో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌. బింబిసారా టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న కల్యాణ్ రామ్ ఈ సినిమాని.. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ ప‌తాకంపై హ‌రికృష్ణ‌.కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్ ట్యాగ్ లైన్. వ‌శిష్ఠ్ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఆగస్ట్ 5న సినిమా రిలీజ్ అవుతుంది. జూలై 29న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘ‌నంగా జ‌ర‌గ‌నుంది. హీరో ఎన్టీఆర్ ఈ వేడుక‌కు ముఖ్య అతిథిగా హాజ‌ర‌వుతున్నారు. ఈ నేప‌థ్యంలో బుధ‌వారం బింబిసార చిత్రం నుంచి రిలీజ్ ట్రైల‌ర్‌ను ఎన్టీఆర్ విడుద‌ల చేసి చిత్ర యూనిట్‌కి అభినంద‌న‌లు తెలిపారు. 

బింబిసారా ట్రైలర్ లోకి వెళితే..

హ‌ద్దుల‌ను చేరిపేస్తే మ‌న రాజ్య‌పు స‌రిహద్దుల‌ను ఆపే రాజ్యాల‌ను దాటి విస్త‌రించాలి. 

శ‌ర‌ణు కోరితే ప్రాణ బిక్ష‌.. ఎదిరిస్తే మ‌ర‌ణం అంటూ

బింబిసారుడిలా పీరియాడిక్ గెట‌ప్‌లో క‌నిపించిన నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌.. ప‌వర్‌ఫుల్ న‌ట‌న‌తో మెప్పించారు. 

ఆ వెంట‌నే.. నీ క‌ల‌ల సామ్రాజ్యాన్ని సాధించే బింబిసారుడు వ‌స్తున్నాడు చూడు అన‌గానే స్టైలిష్‌గా క‌నిపిస్తూ విల‌న్స్ భ‌ర‌తం పడుతూ మ‌రో కోణంలో  అలరించారు. 

నాడైనా నేడైనా త్రిగ‌ర్త‌ల చ‌రిత్ర‌ను తాకాలంటే ఈ బింబిసారుడు క‌త్తిని దాటాలంటూ క‌ళ్యాణ్ రామ్ చెప్పిన డైలాగ్ వింటుంటే గూజ్ బంప్స్ వచ్చేస్తున్నాయి. ఈ ఎగ్జయిట్‌మెంట్‌ను ఆగ‌స్ట్ 5 వ‌ర‌కు వేచి చూడాల్సిందే.  

Bimbisara Trailer released :

NTR launches Bimbisara trailer

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ