సీనియర్ సినీ జర్నలిస్టు గుడిపూడి శ్రీహరి, నేటి జర్నలిస్టు జెమినీ శ్రీనివాస్ కు ఘన నివాళి. జర్నలిజంలో ఇప్పటితరం గుడిపూడి శ్రీహరిని ఆదర్శంగా తీసుకోవాలి గుడిపూడి శ్రీహరి, జెమినీ శ్రీనివాస్ సంతాపసభలో సినీ ప్రముఖులు తొలితరం సినీ జర్నలిస్టు, ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ స్థాపకుల్లో ఒకెరైన గుడిపూడి శ్రీహరి గతనెలలో మృతిచెందిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఈతరం జర్నలిస్టు జెమినీ శ్రీనివాస్ కూడా హఠాన్మరం పొందారు. ఈ సందర్భంగా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ప్రస్తుత కమిటీ ఆధ్వర్యంలో వారిరువురికీ సంస్కరణ సభ నిర్వహించింది. గురువారం సాయంత్రం ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ లో జరిగిన ఈ సభకు సీనియర్ నటులు మురళీమోహన్, నిర్మాత ఆదిశేషగిరిరావు, దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, ప్రముఖ నిర్మాత కె ఎస్ రామారావు, దర్శకులు కాశీ విశ్వనాథ్, సీనియర్ దర్శకులు రేలంగి నరసింహారావు, ప్రముఖ దర్శకులు వైవిఎస్ చౌదరి, నిర్మాతల మండల సెక్రెటరీ ప్రసన్నకుమార్, నిర్మాత అశోక్ కుమార్, నిర్మాత గోపీచంద్ పాటు పలువురు హాజరై నివాళుర్పరించారు.
ప్రముఖ నటుడు మురళి మోహన్ మాట్లాడుతూ.. నేను సినిమా ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తలోనే గుడిపూడి శ్రీహరితో నాకు పరిచయం ఏర్పడింది. అప్పట్లో పరిశ్రమ చెన్నై లోనే ఉండేది. కానీ చాలా సినిమాల షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుండేవి. షూటింగ్ కు వచ్చిన ప్రతి సారి కూడా శ్రీహరిని కోలుకునే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సాయంత్రం పూట సారథి స్టూడియోకో, మరో స్టూడియోకు వచ్చి అందరితో కలివిడిగా మాట్లాడటం జరిగేది. సినిమాల విషయాలు, మంచి సినిమాల గురించి చర్చించడం వంటివి చేస్తూండేవాళ్ళము. ఆయన సమీక్షలు నిర్మొహమాటంగా ఉండేవి. ఎవరినో పొగడటం కోసం కాకుండా సినిమా బాగుంటే బాగుందని, బాగు లేకపోతే ఎందుకు బాగాలేదు, ఎక్కడ బాగాలేదు అనే అంశాలను చాలా చక్కగా వివరించేవారు. తప్పులను ఎలా సరిదిద్దుకోవాలి అనే అంశాలను కూడా సూచనగా రాసేవారు. మాలాంటి వాళ్ళు అప్ కమింగ్ లాంటి వాళ్ళను పక్కకు తీసుకెళ్లి సలహాలు చెప్పేవారు అన్నారు.