Advertisementt

కార్తికేయ 2 థియేట్రికల్ ట్రైలర్ డేట్ ఫిక్స్

Tue 02nd Aug 2022 01:07 PM
nikhil,karthikeya 2,karthikeya 2 trailer  కార్తికేయ 2 థియేట్రికల్ ట్రైలర్ డేట్ ఫిక్స్
Karthikeya 2 trailer treat arriving కార్తికేయ 2 థియేట్రికల్ ట్రైలర్ డేట్ ఫిక్స్
Advertisement
Ads by CJ

హీరో నిఖిల్, చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో కార్తికేయకి సీక్వెల్ గా వస్తున్న కార్తికేయ‌ 2పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే కార్తికేయ 2 నుండి విడుదలైన ట్రైలర్ 1 కి అద్భుతమైన స్పందన వచ్చింది. శాంతను ఇది నువ్వు ఆపలేని యాగం.. నేను సమిధను మాత్రమే.. ఆజ్యం మళ్లీ అక్కడ మొదలైంది.. ప్రాణత్యాగం చేసే తెగింపు ఉంటేనే దీనిని పొందగలం అంటూ అదిరిపోయే డైలాగ్స్ తో సాగే ట్రైలర్ 1 ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో ఆగష్టు 6నా కార్తికేయ 2 థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ట్రైలర్ 1తో ఈ సినిమా పై వచ్చిన అంచనాలకు మించే స్థాయిలో ఈ థియేట్రికల్ ట్రైలర్ ఉండనుంది. 

ఈ చిత్రంలో ముగ్ధ పాత్రలో అనుపమ పరమేశ్వరన్.. నిఖిల్ కి జంట‌గా న‌టిస్తుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం కార్తికేయ 2 ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో నడుస్తున్నాయి. ఎక్కడా చూసిన కార్తికేయ 2 టీం సినిమాని ప్రమోట్ చేస్తూ వస్తుంది. బుల్లితెర షోస్, మిగతా ప్రమోషన్స్ తో టీం బిజీ బిజీగా గడిపేస్తుంది.

Karthikeya 2 trailer treat arriving:

All set for Karthikeya 2 trailer

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ